తెలంగాణ ఇన్ చార్జ్ కు మంత్రి పదవి, లక్కీ‘రాజు’, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా!

బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ నువ్వానేనా అంటూ పోటీ పడటంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అప్పుడు మొదలైన తలనొప్పి ఇంకా తగ్గలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం పూర్తి కావడంతో తరువాత మంత్రి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఇబ్బంది ఎదురైయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, పార్టీలో సీనియర్లు అయిన ఎమ్మెల్సీలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు.

https://telugu.oneindia.com/news/india/boyfriend-blackmailing-aunty-and-enjoying-her-husband-who-called-boyfriend-and-killed-her-near-beng-344674.html

శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్న వారిలో 23 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ అంతకంటే కాదు. మంత్రి పదవి వెతుక్కుంటూ అదృష్టలక్ష్మి ఆయన ఇంటి తలుపు తట్టింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న సమయంలో ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని మాన్వి నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే బోస్ రాజుకు మంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది. క్షత్రియ (రాజులు) కులానికి చెందిన బోస్ రాజు సిద్దరామయ్య క్యాబినేట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

https://telugu.oneindia.com/news/india/boyfriend-blackmailing-aunty-and-enjoying-her-husband-who-called-boyfriend-and-killed-her-near-beng-344674.html

అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు అసెంబ్లీ నియోక వర్గం టిక్కెట్ తనకు కాని, తన కుమారుడు రవి బోస్ రాజుకు కాని ఇవ్వాలని బోస్ రాజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మనవి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు బోస్ రాజు, ఆయన కుమారుడు రవి బోస్ రాజు సైలెంట్ గా ఉండిపోయారు.

ఆ రోజు బోస్ రాజుకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ రోజు చెప్పిన మాట నిలబెట్టుకుని బోస్ రాజుకు మంత్రి పదవి ఇచ్చింది. ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న బోస్ రాజు ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా, లేదా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవిలో కొనసాగాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారల పరిశీలకుడు అయిన క్షత్రియ కులానికి చెందిన బోస్ రాజుకు కర్ణాటకలో మంత్రి పదవి ఇచ్చింది.

మేడమ్స్ అదుర్స్, పర్సనల్ మ్యాటర్, చెప్పులతో కొట్టుకున్న లేడీ టీచర్స్ !

https://telugu.oneindia.com/news/india/the-lady-head-master-lady-teachers-who-created-a-ruckus-in-the-school-by-hitting-her-with-sandals-344691.html

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యాలని, బోస్ రాజుకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణకూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంచనా వేస్తోందని తెలిసింది. వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే కర్ణాటకలో ఎంతో సీనియర్లు అయిన ఆర్ వీ. దేశ్ పాండే, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, సిద్దరామయ్యకు చాలా సన్నిహితుడు అయిన బసవరాజ రాయరెడ్డి, టీబీ. జయచంద్రలకు మంత్రి పదవులు ఇవ్వకుండా వారిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కనపెట్టింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మార్క్ రాజకీయంతో కర్ణాటకలో మంత్రి పదవులు కేటాయించారని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+