బంపర్ ఆఫర్ ..10 గ్రాముల బంగారం కేవలం రూ.77,000 మాత్రమే
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులే కాదు, పెట్టుబడిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ ధరల పెరుగుదల ఇక త్వరలో ఆగిపోతుందని, పెద్ద ఎత్తున పతనం ఉంటుందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు అమిత్ గోయల్ సంచలన అంచనా వేశారు. గోయల్ $2.4 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించే పేస్ 360 కంపెనీతో సంబంధం కలిగి ఉన్నందున, ఆయన అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి.
అమిత్ గోయల్ ప్రకారం, బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దశాబ్దాలలో అత్యంత ప్రమాదకరమైన గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ధరలు పెరగడానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ, గత నలభై సంవత్సరాలలో డాలర్ ఇండెక్స్ బలహీనమైనప్పుడు మాత్రమే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన వివరించారు. ఈ బలహీనత కారణంగానే ప్రస్తుత రికార్డు ధరలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గోయల్ అంచనాలు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి శుభవార్తే. ఆయన ప్రకారం, రాబోయే కొన్ని రోజులు లేదా వారాల్లోనే బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే స్థాయికి చేరుకుంటాయి.బంగారం ధరలు ఏకంగా 30-35% తగ్గి, 10 గ్రాములకు రూ. 77,701 కి చేరుకోవచ్చు. వెండి ధరలు కూడా సుమారుగా సగానికి తగ్గవచ్చని గోయల్ అంచనా వేశారు.
పెట్టుబడిదారులకు అమిత్ గోయల్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు తొందరపడకుండా, బంగారం ధర ఔన్సుకు $2,600 నుంచి $2,700 డాలర్ల వరకు పడిపోయేంత వరకు వేచి ఉండాలని సూచించారు.ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున, అంతకు ముందు చేసే పెట్టుబడులు ప్రమాదకరం కావచ్చని ఆయన హెచ్చరించారు.
ముఖ్య గమనిక: బంగారం, వెండి మార్కెట్ అస్థిరమైనది. చిన్న తేడాలు కూడా పెట్టుబడి రాబడిలో భారీ మార్పులను తీసుకురాగలవు. కాబట్టి, పెట్టుబడిదారులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ధృవీకరించబడిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం తప్పనిసరి. ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు నిపుణుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.












Click it and Unblock the Notifications