అల్లకల్లోలం.. పొద్దుపొద్దునే దరిద్రం. ఎవరి మొహం చుశారో!
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సోమవారం (మార్చి 09, 2026) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలై, ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల అసాధారణ పెరుగుదల దేశీయ సూచీలను పాతాళానికి నెట్టేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,400 పాయింట్ల మేర పతనమై ఇన్వెస్టర్లను వణికించింది.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 26 శాతం మేర పెరగడం కోలుకోలేని దెబ్బగా మారింది. ఇది జూలై 2022 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. చమురు ధరల పెరుగుదల వల్ల దేశంలో రవాణా ఖర్చులు పెరిగి, తద్వారా ద్రవ్యోల్బణం (Inflation) నియంత్రణ తప్పుతుందనే ఆందోళన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపారు.

అల్లకల్లోలంలో సూచీలు - రూపాయి పతనం
ఉదయం 9:30 గంటల సమయానికి మార్కెట్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. సెన్సెక్స్ 2.87 శాతం క్షీణించి 76,505 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 726 పాయింట్లు నష్టపోయి 23,724 స్థాయికి పడిపోయింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.25 వద్దకు పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. మార్కెట్ అస్థిరతను సూచించే 'ఇండియా విక్స్' (India VIX) ఏకంగా 21 శాతం పెరిగి 24.18 స్థాయికి చేరడం ఇన్వెస్టర్ల భయాందోళనలకు అద్దం పడుతోంది.
ఒక్క కోల్ ఇండియా మినహా.. అన్నీ నష్టాలే
మార్కెట్ పతనంలో దాదాపు అన్ని రంగాలు కుప్పకూలాయి. నిఫ్టీ సూచీలో ఉన్న దిగ్గజ సంస్థలైన టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ భారీగా నష్టపోయాయి. పెరిగిన ఇంధన ధరల ప్రభావంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేర్లు కుంగాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతూ మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications