ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చిత్తూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, గుడిపాల మండలాలకే ఈ నియోజకవర్గం పరిమితమైంది. చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రమైన చిత్తూరు లో సికె జయచంద్రారెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. ఇక్కడి నుండి చిన్నమరెడ్డి రెండు సార్లు, ఆంజనేయులు నాయుడు రెండు సార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన జాన్సీ లక్ష్మీ ఒక సారి ఎంపీగా నూ గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుండి ఒకసారి గెలుపొందిన వేంకటేశ్వర చౌదరి మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్య చెంగల్రాయనాయుడికి కుమారుడు. ఇర, 2009 తరువాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామా ల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మార్పులు జరిగాయి. అవి 2014 నాటికి ప్రభావం చూపాయి.
15 సార్లు ఎన్నికలు జరిగితే..
చిత్తూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ ఎనిమిది సార్లు, టిడిపి మూడు సార్లు, కెఎల్‌పి ,స్వతంత్ర, జనతా పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. కాగా, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి గెలుపొందారు. ఇక, 2009 లో ఇక్కడి నుండి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసిన జె శ్రీనివాసులు ఆ తరువాత వైసిపి లో చేరారు. 2009 లో ఇక్కడ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జయచంద్రారెడ్డి 2014 ఎన్నికలకు ముందుగా వైసిపి లో చేరారు. అయినా ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. దీంతో..టిడిపి - వైసిపి మధ్యే ప్రధాన పోటీ జరిగింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తంగా 192535 ఓట్లు ఉండగా, అందులో 144878 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన సత్యప్ర భకు 73430 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన జె శ్రీనివాసులుకు 66631 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన సత్యప్రభ 6799 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సత్యప్రభ దివంగత ఎంపీ ఆదికేశవుల నాయుడి భార్య. కొద్ది కాలం క్రితం సీనియర్ నేత జయచంద్రారెడ్డి వైసిపి లో నుండి బిజెపిలో కి చేరారు.












Click it and Unblock the Notifications