మోదీ ఖ‌బ‌డ్దార్ : ప‌వ‌న్ కు ఓటేస్తే ఏం లాభం : సినిమాల్లేకే..మోహ‌న్‌బాబు ఇలా : చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

టిడిపి అధినేత చంద్ర‌బాబు ప్ర‌ధాని మోదీ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ ద్రోహి అని బాబు వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా మోహ‌న్‌బాబు పై విమ‌ర్శ‌లు చేసారు. సినిమాల్లేక‌నే వ‌ల‌స ప‌క్షులు వ‌చ్చాయ‌న్నారు. ఇక‌, ప‌న‌వ్ క‌ళ్యాన్ కు ఓటేస్తే ఏం లాభ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

మోదీ కి హెచ్చ‌రిక‌..

మోదీ కి హెచ్చ‌రిక‌..

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో టిడిపి అధినేత చంద్ర‌బాబు నేరుగా ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసారు. ఏపి ప‌ర్య‌న‌లో భాగంగా మోదీ చేసిన ఆరోప‌ణ‌ల పై బాబు స్పందించారు. మోదీ త‌న‌ కంటే మొన్న రాజకీయాల్లోకి వచ్చాడని.. త‌న‌కే కథలు నేర్పిస్తున్నారన్నారు. ఆంధ్రుల్ని కించపరిస్తే ఖబడ్దార్‌.. జాగ్రత్త. ఒక్కమాట అంటే మేం పదిమాటలు అంటాం అంటూ హెచ్చ‌రించారు. మోదీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు... ఈడీ, ఐటీ దాడులకు మేం భయపడం. మోదీకి ఊడిగం చేయడానికి మేం సిద్ధంగా లేం అని స్ప‌ష్టం చేసారు. మీకు ఊడిగం చేయడానికి జగన్‌ సిద్ధంగా ఉన్నారు. జైలుకు పోతానన్న భయంతో మోదీకి ఊడిగం చేస్తున్నాడు. ఏ ముఖం పెట్టుకుని మోదీ మన రాష్ట్రానికి వచ్చార‌ని ప్ర‌శ్నించారు. విభజన హామీలు అమలు చేశాకే అడుగుపెట్టాలన్నారు. త‌న పై వ్యక్తిగ తం గా విమర్శలు చేస్తున్నారని..త‌న పై దాడి చేయాలని చూస్తున్నారన్నారు. మోదీ త‌న‌ కుటుంబం గురించి ట్లాడుతు న్నార‌ని.. మరి మోదీ కుటుంబం సంగతేంటని ప్ర‌శ్నించారు.

మోహ‌న్ బాబు..ప‌వ‌న్ పైనా ఫైర్‌..

మోహ‌న్ బాబు..ప‌వ‌న్ పైనా ఫైర్‌..

టిడిపి అధినేత చంద్ర‌బాబు ప‌రోక్షంగా మోహ‌న్ బాబు పై వ్యాఖ్య‌లు చేసారు. చిత్తూరు జిల్లా కే చెందిన ఓ సినీ న‌టుడు సినిమాలు లేక అమ‌రావ‌తికి వ‌ల‌స ప‌క్షిలా వ‌చ్చార‌న్నారు. ఆయ‌న రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నార‌ని..కేసీఆర్ కు ఊడిగం చేసుకుంటే త‌న‌కు అభ్యంత‌రం లేద‌న్నారు. అయితే ఏపి గురించి మాట్లాడితే స‌హించేది లేద‌న్నారు. ఆ వ‌ల‌స ప‌క్షి హైద‌రాబాద్‌లో ఉంటూ లోట‌స్ పాండ్ నుండి ప‌ని చేస్తున్నార‌న్నారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ రాజ‌కీయాల‌కు కొత్త అని ఆయ‌న‌కు ఓటేస్తే ఏం లాభ‌మ‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న అత్తారింటికి దారి వెతుక్కుంటున్నార‌న్నారు.ఆయ‌న మ‌న సైకిల్ చైన్ కేసీఆర్ లాగేసార‌ని అంటున్నార‌ని..అంత ధైర్యం ఎవ‌రికీ లేద‌న్నారు చంద్ర‌బాబు.

జ‌గ‌న్ కు ఓటేస్తే పెన్ష‌న్లు ఆగిపోతాయి

జ‌గ‌న్ కు ఓటేస్తే పెన్ష‌న్లు ఆగిపోతాయి

ఒక్క ఛాన్స్ అంటూ వైసిపి నేత‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని..వారికి ఒక్క ఓటు వేసిన కేసీఆర్‌..మోదీకి వేసిన‌ట్లేన‌ని చం ద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఏపి పై కుట్ర‌లు చేసే వారి ఆట‌లు సాగనీయ‌న‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ వ‌స్తే ఏపికి పెట్ట‌బడు లు రావ‌ని..వారు భ‌య‌ప‌డి వెళ్లిపోతార‌ని చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ కు ఓటు వేస్తే పెన్ష‌న్లు ఆగిపోతాయ‌న్నారు. కేసీఆర్‌..మో దీ కి జ‌గ‌న్ ఊడిగం చేస్తున్నార‌న్నారు. జ‌గ‌న్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చార‌ని..అదే త‌న‌కు ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్ అని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ గెలిస్తే ప్ర‌తీ రోడ్డులో రౌడీయిజం వ‌స్తుంద‌న్నారు. న‌రేంద్ర మోదీ త‌న పై దాడులు చేయాల‌ని చూస్తున్నార‌ని..త‌న పై దాడి చేస్తే అది ఏపి పై దాడేన‌ని పేర్కొన్నారు. ఏపికి కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తీ ఒక్క‌రి పైనా ఉంద‌న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+