పెళ్లైంది కానీ.. ప్రియుడి మోజులో నమ్మి వెళ్తే... మట్టుబెట్టాడు
చిత్తూరు : ఆమెకు పెళ్లైంది. భర్తతోపాటు కూతురు కూడా ఉంది. కానీ ఆమె కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడిపోయింది. అతని నమ్మి కట్టుకున్న భర్తను, కూతురును వదిలేసి వెళ్లిపోయింది. కానీ తానే సర్వస్వం అనుకొని వచ్చిన వివాహితను మట్టుబెట్టాడు కీచకుడు. రెండునెలల తర్వాత జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పెళ్లైంది కానీ ..
రామచంద్రపురం మండలం పీవీ పురానికి చెందిన భాను .. రాయలచెరువుకు చెందిన మునిశేఖర్‌తో పదేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే భర్త మునిశేఖర్ కాస్త అమాయకుడు అదే అతని జీవితాన్ని చీద్రం చేసింది. శేఖర్‌ను వదిలి పట్టింటికి వెళ్లిపోయింది. గత రెండేళ్ల నుంచి అక్కడే ఉంటుంది. అయితే ఇదే అదనుగా భావించిన రామాపురానికి చెందిన హరి అనే యువకుడు భానుతో పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమ పేరుతో నమ్మించి .. తీసుకెళ్లాడు. విశ్వసించి వెళ్తే మట్టుబెట్టాడు హరి.

లేటుగా స్పందించారు ..
భాను కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు హరి మీద అనుమాన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు .. ఏం జరిగిందోనని ఆరాతీశారు. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే జరిగిన దారుణాన్ని వివరించాడు హరి. తాను భానును తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఏదో విషయంలో చిన్న తగాదా మొదలైందని పేర్కొన్నారు. దాంతో తాను దాడి చేయడంతో భాను చనిపోయిందని పేర్కొన్నారు. ఆ వెంటనే భయపడి రామచంద్రాపురంలో పూడ్చిపెట్టాననే విషయాన్ని పోలీసులకు తెలిపారు.

నమ్మి వెళ్తే ..
ప్రేమపేరుతో తీసుకెళ్లి తమ బిడ్డను హతమార్చారని ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. పోలీసులు కూడా వెంటనే విచారణ జరిగితే బాగుండేదని .. తమ బిడ్డ దక్కేదని చెప్తున్నారు. రెండునెలల కిందట బిడ్డ కనిపించడం లేదని చెబితే పట్టించుకోలేదని, దీంతో ఇన్నాళ్లకు చావు కబురు చల్లగా చెప్పారని వాపోయారు. భాను కనిపించడం లేదని చెప్పిన వెంటనే విచారిస్తే ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు. భార్య విగతజీవిగా మారడంతో శేఖర్, ఆయన కూతురు బోరుగా విలపిస్తున్నారు. ఆ చిన్నారికి అప్పుడే తల్లి దూరమైందా అని కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. నిందితుడు హరిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్భయ కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications