తన పాదం మహిమేంటో మళ్లీ చెప్పిన రోజా..! టీడిపి నేతలు తెలుసుకోవాలంటున్న ఫైర్ బ్రాండ్..!!

Recommended Video

    ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu

    అమరావతి/హైదరాబాద్: సంచలనంగా మారిన ఏపి రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే రోజా పాదం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజాది ఐరన్ లెగ్గని ప్రత్యర్థులు అంటుంటే కాదు నాది గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా అంటోంది జబర్దస్త్ ఆంటీ. తిరుగులేని మెజారిటీతో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆర్కే రోజా అన్నారు. జగన్‌ను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారనే దానికి తాజా ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమన్నారు.

    నాదీ ఎప్పటికీ గోల్డెన్ లెగ్గే..! సన్నాసులే గ్రహించలేక పోయారన్న రోజా..!!

    నాదీ ఎప్పటికీ గోల్డెన్ లెగ్గే..! సన్నాసులే గ్రహించలేక పోయారన్న రోజా..!!

    అమరావతి తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్‌ఎల్పీ సమావేశానికి శనివారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై బాధ్యత కూడా చాలా పెరిగిందన్నారు. మొదటి సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్‌ చెప్పారని.. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదని గుర్తుచేశారు. తన తండ్రిలా రాష్ట్ర ప్రజలను ఆయన అభిమానించారని, ప్రజల కష్టాలు దూరం చేయాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారన్నారు.

    టీడిపి దిమ్మ తిరిగింది..! తెలుగు తమ్ముళ్లపై ప్రజలు కసి తీర్చుకున్నారన్న ఫైర్ బ్రాండ్..!!

    టీడిపి దిమ్మ తిరిగింది..! తెలుగు తమ్ముళ్లపై ప్రజలు కసి తీర్చుకున్నారన్న ఫైర్ బ్రాండ్..!!

    ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా చంద్రబాబు పోటీ చేస్తే ఎలావుంటుందో ఈ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు రోజా. ఆయన అనుభవం ఎంత శాతం ఉందో చంద్రబాబు వెనుకున్న ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన మీద ఐరన్‌ లెగ్‌ ముద్ర వేసి వైఎస్‌ జగన్‌ నుంచి తనను దూరం చేయడానికి టీడీపీ నాయకులు చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. తిరుగులేని ఆధిక్యంతో జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని, తనది గోల్డెన్‌ లెగ్‌ అని టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

    రాజన్న రాజ్యం వచ్చింది..! అందరికి సమ న్యాయమన్న నవ్వుల రాణి..!!

    రాజన్న రాజ్యం వచ్చింది..! అందరికి సమ న్యాయమన్న నవ్వుల రాణి..!!

    వైసీపి ఘన విజయం సాధించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇక... ‘సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాను! ఆరు నుంచి 12 నెలల్లోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను' అని ప్రకటించిన జగన్‌... తన మంత్రివర్గంలో ఎవరిని నియమించుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కేబినెట్‌లో ముఖ్యమంత్రి కాకుండా గరిష్ఠంగా 25 మందికి మాత్రమే చోటు ఉంటుంది.

    తర్వలో మంత్రిగా రోజా..! జగన్ డ్రీమ్ క్యిబినెట్ లో చోటు ఖాయమంటున్న నేతలు..!!

    తర్వలో మంత్రిగా రోజా..! జగన్ డ్రీమ్ క్యిబినెట్ లో చోటు ఖాయమంటున్న నేతలు..!!

    అయితే, వైసీపీ నుంచి ఏకంగా 151 మంది గెలిచారు. వారిలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, పార్టీ పెట్టినప్పటి నుంచి తననే అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న వారూ ఉన్నారు. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో చోటు ఇస్తానంటూ తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురికి జగన్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. నగరి ఎమ్మెల్యే రోజా కి క్యాబినెట్ లో సముచిత స్థానం కల్పిస్థారనే చర్చ కూడా జరుగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+