ఉద్రిక్తంగా లోటస్ పాండ్.!భారీగా మొహరించిన పోలీసులు.!షర్మిల టీ సేవ్ కార్యక్రమంపై ఆంక్షలు?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యార్ధి, నిరుద్యోగ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రశేఖర్ రావు నియంతృత్వ పోకడలు, నీతిమాలిన రాజకీయాలకు ఇది పరాకాష్ట వైయస్ షర్మిళ అభివర్ణించారు. అందులో భాగంగా పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో టీ-సేవ్ కార్యక్రమంపై భవిష్యత్ కార్యాచరణ కోసం భేటీ నిర్వహించుకుంటున్న తమ నేతలను నిలువరించడం ఎంతవరకు సమంజసమని షర్మిళ ప్రశ్నిస్తున్నారు.

షర్మిళ రాజకీయ కార్యక్రమంపై ఆంక్షలు.. లోటస్ పాండ్ లోనికి ఎవ్వరిని అనుమతించని పోలీసులు..
లోటస్ పాండ్ వద్ద భారీగా మొహరించిన పోలీసు బలగాలపై షర్మిళ మండిపడుతున్నారు. ఉద్యమాల పునాదిపై పురుడు పోసుకున్న పార్టీ అని సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకునే చంద్రశేఖరావు, పనికిమాలిన కారణాలు చూపి దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం సమంజసమా? ఇదేనా సీఎం ఉద్యమ స్ఫూర్తి? తెలంగాణకు పట్టిన చంద్రశేఖర్ రావు నీచపాలన తుప్పును వదిలించడానికి, సీఎం తప్పులను కడిగేయటానికి పూనుకున్న ఈ పోరాటాన్ని చూసి వెన్నులో వణుకా? కడుపులో మంటా? కంటికి కునుకులేదా? యువత అసంతృప్తి జ్వాలలు రగిలి చంద్రశవేఖర్ రావును, ఆయన సర్కారును మాడ్చి మసి చేస్తాయని ఘాటుగా విమర్శించారు షర్మిళ.

పోలీసు బలగాలతో నిండిపోయిన షర్మిళ నివాసం.. ఉద్రిక్తంగా మారిన లోటస్ పాండ్..
విద్యార్థుల పట్ల పోరాటం ఒక షర్మిలనో లేక వైయస్సార్ తెలంగాణ పార్టీనో చేస్తున్న ఉద్యమం కాదని, పార్టీలు, సంస్థలు, సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావి వర్గాలు, ఎందరో మరెందరో ఒక్కటై యువత కోసం చేస్తున్న ఉమ్మడి పోరాటమని, వారికి న్యాయం జరిగే వరకు ఆగేది లేదు, అలిసేది లేదన్నారు షర్మిళ. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ గారి 125 విగ్రహాన్ని ఆవిష్కరించి రెండు రోజులు కూడా కాలేదని, అంతలోనే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గాలికొదిలేశారన్నారు షర్మిళ. ప్రశ్నించే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని, పోరాడే గొంతులను నొక్కేస్తున్నారన్నారు షర్మిళ.

కావాలనే కక్షసాధింపు.. కేసీఆర్ పై మండిపడ్డ షర్మిళ
అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నామని పైకి చెబుతూనే, సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే అంశం మరోసారి రుజువైందని, తెలంగాణ గడ్డ చంద్రశేఖర్ రావు నియంతలను ఎంతోమందిని చూసిందని, దొరల పాలనను తరిమికొట్టింది. రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ రావు సర్కారుకు కూడా ఇదే గతి పడుతుందని షర్మిళ హెచ్చరించారు. ప్రశాంతంగా చేపట్టే పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం, కార్యకర్తలను, నాయకులను పార్టీ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం చంద్రశేఖర్ రావు పిరికితనానికి నిదర్శనమని షర్మిళ మండిపడుతున్నారు.

విద్యార్ధుల భవితకోసం పారాటం ఆగదు.. చివరి శ్వాస వరకూ ఉద్యమిస్తానన్న షర్మిళ
అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా తమ పోరాటం, తమ దీక్ష ఆగేది లేదన్నారు. యువత కోసం భవిత కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు షర్మిళ. నాతో పాటు కలిసి పోరాడటానికి యావత్ తెలంగాణ సమాజం సిద్దంగా ఉందని, ఆ ఉప్పెనలో గులాబీ సర్కార్ కొట్టుకుపోతుందని షర్మిళ హెచ్చిరంచారు. ఇప్పటికైనా తమ పార్టీ కార్యాలయం ముందు మొహరించిన వందలాది మంది పోలీసు బలగాలను ఉపసంహరించుకుని తమ పార్టీ కార్యక్రమాల పట్ల అనవసరపు ఆంక్షలు విధించొద్దని తెలంగాణ ప్రభుత్వానికి షర్మిళ సూచించారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications