హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాళ ఒక్కరోజే 13,742 మెగావాట్ల విద్యుత్ డిమాండ్.. మరీ ఏప్రిల్, మే నెలలో పరిస్థితి..?

|
Google Oneindia TeluguNews

ఎండలు పీక్‌కి చేరాయి. ఉదయం 9,10 దాటిందంటే చాలు.. ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. మధ్యాహ్నాం కాస్త వడ గాలి వీస్తోంది. సాయంత్రం ఉక్కపోత తప్పడం లేదు. సో జనం.. ఇంట్లో ఏసీ, కూలర్లు వాడుతున్నారు. అయితే పవర్ ఉంటే ప్రాబ్లం లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. కరెంట్‌కు డిమాండ్ పెరుగుతుంది.

ఫ్యాన్, కూలర్లు రన్..

ఫ్యాన్, కూలర్లు రన్..


ఎండల నుంచి తప్పించుకొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక ఇంట్లో ఉండే వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి నిర్విరామంగా ఫ్యాన్లు, కూలర్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కరెంటుకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఎండలు మండుతుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. శనివారం ఒక్కరోజే.. 13 వేల 742 మెగావాట్ల పవర్ డిమాండ్‌ నమోదైంది.

 విద్యుత్ డిమాండ్ రికార్డ్

విద్యుత్ డిమాండ్ రికార్డ్


శనివారం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాలకు.. తెలంగాణలో 13 వేల 742 మెగావాట్ల విద్యుత్‌‌ను వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఇదే అత్యధిక పవర్‌ డిమాండ్‌. అయితే పీక్‌ డిమాండ్‌ను విద్యుత్‌ సంస్థలు అధిగమించినట్లు ట్రాన్స్‌ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో విద్యుత్‌ వినియోగం హై లెవల్‌కు చేరింది. గత ఏడాది గ్రేటర్‌లో 55 మిలియన్‌ యూనిట్స్‌ దాటని విద్యుత్‌ వినియోగం.. ఈసారి మార్చిలోనే 65 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది.

ఏప్రిల్, మే నెలలో పరిస్థితి

ఏప్రిల్, మే నెలలో పరిస్థితి


మార్చిలోనే ఇలా ఉంటే.. ముందు ముందు విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. పదిహేను వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యుత్‌ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ సారి ఆ మార్క్ దాటే ఛాన్స్ ఉంది. అంటే ఏప్రిల్ లేదంటే మే నెలలో విద్యుత్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉంది. కానీ అదేం లేదని.. ఎంత డిమాండ్ ఉన్నా సరఫరా చేస్తామని చెబుతున్నారు. సో మరో రెండు నెలలు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరీ.

English summary
electricity demand high in telangana state. today 13,742 megawatt power demand in state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X