సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అన్ని పిటిషన్లు కొట్టివేత, 80 శాతం కూల్చివేత..
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి దాఖలైన పిటిషన్ అన్నింటినీ ధర్మాసనం కొట్టివేసింది. ఇఫ్పటికే 80 శాతం భవనాలను కూల్చివేయగా.. మిగతా 20 శాతం భవనాల కూల్చివేత ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. మరింత వేగంగా కూల్చివేత పనులు జరగనున్నాయి.
పీఎల్ విశ్వేశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసానం శుక్రవారం కొట్టివేసింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని.. కొత్తగా నిర్మించే భవనాలకు మాత్రమే అనుమతులు అవసరమని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదన్న సొలిసిటర్ జనరల్ వాదనను హైకోర్టు ఏకీభవించింది.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నాకే కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టంచేసింది. భవనాల కూల్చివేతకు ప్రభుత్వానికి అన్ని అధికారులు ఉన్నాయని పిటిషన్ కొట్టివేసింది. అయితే కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులు చేపట్టాలని సూచించింది.
Recommended Video
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications