హైదరాబాద్‌లో దారుణం: అంతా చూస్తుండగానే వ్యక్తిని వెంటాడి నరికి చంపారు
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అంతా చూస్తుండగానే హైదరాబాద్‌లో పూరానాఫూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
జియాగూడ బైపాస్ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడ్ని మరో ముగ్గురు తరుముకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో కిరాతంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న కుల్సుంపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

కాగా, హత్య చేసి నిందితులు పక్కనే ఉన్న మూసీనదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కుల్సుంపుర సీఐ అశోక్ కుమార్ తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మృతుడి ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇస్తామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్(32)గా పోలీసులు గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిందితులు ఎవరు? ఎందుకు అతడ్ని హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications