హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ka paul: దత్తత అంటే.. భూముల ఆక్రమణ, అమ్మడం, దోచుకోవడమే

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ రిజల్ట్ వచ్చింది. కానీ విమర్శలు మాత్రం తప్పడం లేదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సారి మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని.. మద్యం ఎరులైపారిందని, డబ్బు విచ్చలవిడిగా పంచారని ఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేఏ పాల్ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టాయని అన్నారు. పోలింగ్ కోసం వీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్లను వినియోగించాల్సిందని తెలిపారు. అదే విషయాన్ని తాను చెప్పినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు అందరూ టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేశారని విమర్శించారు.

ka paul made hot comments on ktr munugodu adoption

మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పారని కేఏ పాల్ తెలిపారు.దత్తత తీసుకోవడమంటే అక్కడున్న భూములను ఆక్రమించడం అని సంచలన ఆరోపణలు చేశారు. లేదంటే అమ్ముకోవడం, లక్షల కోట్లను దోచుకోవడం అన్నారు. మునుగోడు ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

బై పోల్‌లో కేఏ పాల్‌కు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. 13వ రౌండ్ లో అత్యధికంగా 86 ఓట్లను ఆయన సాధించారు. కానీ ఫస్ట్ ప్లేస్‌లో తాను నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం కూడా జోరుగా చేశారు. ఇప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకున్న తర్వాత.. ఆక్రమణలే ఉంటాయని పేర్కొన్నారు.

English summary
prajashanti party chief ka paul made hot comments on ktr munugodu adoption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X