హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మంత్రికి కరోనా.. ఫ్యామిలీ మొత్తానికి వైరస్ రక్కసి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చాలమంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. మరో మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ జరిగింది.

కొప్పుల ఈశ్వర్ గత రెండురోజుల నుంచి అస్వస్థతగా ఉన్నారు. ఆయనకు కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నానని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈశ్వర్ కోరారు.

koppula ishwar infected corona virus

Recommended Video

COVID19: Hyderabad People Self Quarentine మహానగర పర్యాటక ప్రాంతాలు వెలవెల..!!

గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వైరస్ సోకి ఉంటుంది. ఇటీవలే మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా రావడం ఇదీ రెండోసారి. ఫస్ట్ వేవ్ సమయంలో కూడా కరోనా వైరస్ వచ్చింది. ఈ సారి కూడా వైరస్ రక్కసి బారిన పడ్డారు. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.

English summary
telangana minister koppula ishwar infected corona virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X