రాజు ఏందిది: మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వ్యక్తి.. గాయాలతో మృతి
హైదరాబాద్‌లో అత్యాధునిక రవాణా వ్యవస్థ మెట్రో.. ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే మెట్రో స్టేషన్ ఎక్కీ మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా పలు ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ ఈ ఘటన జరగడంతో భద్రతా వైఫల్యంపై పలు ప్రశ్నలు వస్తున్నాయి.
సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్‌లో ఘటన జరిగింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు హైదరాబాద్లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. పలు ప్రాంతాలకు రైళ్లు తిరుగుతున్నాయి. దేశంలో రెండో పెద్ద మెట్రోగా హైదరాబాద్ నిలిచింది. సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. స్టేషన్ నుంచి కిందకు దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తీవ్రగాయాలై రక్తం మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి నిజామాబాద్‌కు చెందిన రాజుగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గ్రేటర్ మెట్రోను ప్రయాణికులు యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు తప్పనిసరి అయ్యింది. ఇప్పుడు కొన్ని ఆఫీసులు తెరవడంతో వారు ప్రయాణిస్తున్నారు. మిగతావారు కూడా అలా యూజ్ చేస్తున్నారు. వేగంగా గమ్యస్థానాలకు మాత్రం మెట్రో చేరుస్తుంది. కానీ ఇలా సూసైడ్ చేసుకొని.. వారు సిబ్బందికి సవాల్ విసురుతున్నారు. కరోనా సమయంలో మెట్రో సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆంక్షల మధ్య నడిపిస్తున్నారు. ఇంతలో ఇలా సూసైడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications