Hyderabad: ఉప్పల్ వైపు వెళ్తున్నారా..
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 గంటల మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించారు. లారీలు, డంపర్లు, ఎర్త్‌మూవర్‌లు, ఆర్‌ఎంసి ట్రక్కులు, వాటర్ ట్యాంకర్లు, ఇతర భారీ వాహనాలు వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల ఎక్స్ రోడ్-చెర్లపల్లి-ఐఓసిఎల్-ఎన్‌ఎఫ్‌సి రహదారికి దారి మళ్లిస్తారు.
అదేవిధంగా ఎల్‌బీనగర్ నుంచి నాగోలుకు వచ్చే కార్లను హెచ్‌ఎండీఏ-బోడుప్పల్-చెంగిచెర్ల ఎక్స్‌రోడ్డు మీదుగా నాగోల్ మెట్రోస్టేషన్‌కు మళ్లించగా, మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే భారీ వాహనాలను చెర్లపల్లి-చెంగిచెర్ల మీదుగా హబ్సిగూడ వైపు మళ్లిస్తారు. ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టలేదు. కల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ తృటిలో ఓటమి పాలయింది. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అటు ముంబై ఇండియన్స్ కూడా బోణి చేయలేదు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. హైదరాబాద్ లో జరగనున్న మ్యాచ్ లో గెలవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. చూడాలి ఏ జట్టు గెలుస్తుందో.
ఈ మ్యాచ్ కోసం హైదరాబాదీలు వేచి చూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేశారు. మ్యాచ్ సందర్భంగా ప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు నడవనున్నాయి.












Click it and Unblock the Notifications