15 ఏళ్ల బాలికను కాల్చి చంపిన 'బాయ్‌ఫ్రెండ్'.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో దారుణం చోటుచేసుకుంది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికను ఆమె 20 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ కాల్చి చంపాడు. స్నాక్స్ తినడానికి స్నేహితురాలితో కలిసి బయటికెళ్లిన బాలికపై నిందితుడు పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 8:10 గంటల ప్రాంతంలో జహంగీర్‌పురిలోని డి-బ్లాక్ మార్కెట్‌లో ఒక క్లినిక్ ముందు ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
ఘటన వివరాలు ఇలా..
ప్రాథమిక విచారణలో భాగంగా, బాలిక స్నేహితురాలితో కలిసి స్నాక్స్ తినడానికి డీ-ఈ బ్లాక్ మార్కెట్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారు క్లినిక్ దగ్గర నడుస్తున్నప్పుడు, నిందితుడు తన స్నేహితుడితో కలిసి వచ్చి బాలికపై కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా.. బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

నిందితుడి కోసం గాలింపు
బాలిక, నిందితుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అయితే హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనకు దారితీసిన వ్యక్తిగత కోణాలు, వివాదాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఇప్పటికే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సాక్షుల విచారణ.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
పోలీసులు ఈ ఘటనపై అనేక మంది సాక్షులను విచారిస్తున్నారు. క్లినిక్, సమీపంలోని దుకాణాల నుంచి సీసీటీవీ ఫుటేజీలను కూడా సేకరించి, ఘటన జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు. బాలికతో పాటు ఉన్న ఆమె స్నేహితురాలిని ఈ కేసులో ప్రధాన సాక్షిగా పరిగణిస్తున్నారు. బాధితురాలి కుటుంబం జహంగీర్‌పురిలో ఒక మురికివాడలో నివసిస్తుంది. ఆమె తల్లి ఇంటి పనులు చేస్తుండగా, తండ్రి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉంటున్నాడు.
ఇలాంటి ఘటనే జూన్‌లో కూడా సెంట్రల్ ఢిల్లీలో జరిగింది. పహర్‌గంజ్‌లోని ఒక హోటల్ గదిలో 29 ఏళ్ల మహిళను ఆమె 31 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ దాడి చేసి, గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు రాత్రంతా మృతదేహంతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications