ఢిల్లీలో కుప్పకూలిన 150 ఏళ్ల మూడంతస్థుల భవంతి

 150 year old building collapses in Delhi
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ రాజదాని న్యూఢిల్లీలోని బారా హిందూరావ్ ప్రాంతంలో 150 ఏళ్ల నాటి మూడంతస్తుల నివాస భవనం బుధవారం ఉదయం కుప్పకూలింది. ఘటన జరిగిన ప్రాంతం ఉత్తర ఢిల్లీలో ఉంది. భవంతి కుప్పకూలిన ఈ ఘటనలో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది.

సమాచారం రావడంతో ఆరు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హిందూరావ్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

ఉదయం ఏడు గంటల సమయంలో భవంతి కూలుతున్నట్లుగా అనిపించడంతో తాము వెంటనే కిందకు దిగి వచ్చామని, తమ వెంట మరికొందరు బయటకు వచ్చారని, పోలీసులు, స్థానికులు సహకరించారని ఒకరు చెప్పారు.

ఫ్లాట్ ఫాంను ఢీకొన్న ఎంఎంటిఎస్

హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని రెండో నెంబర్ ప్లాట్ ఫాంలో డెడ్ ఎండ్‌ను ఢీకొని ఎంఎంటిఎస్ ఇరుక్కుపోయింది. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను గంటకు పైగా శ్రమించి కాపాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+