మరో దారుణం: కదులుతున్న కారులో అమ్మాయిపై రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కదులుకున్న కారులో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన శనివారంనాడు జరిగిందని అంటున్నారు. గతవారం తాను అశోక్ విహార్‌లోని ఇంటి నుంచి బయటకు వచ్చానని, బంగ్లా సాహిబ్ గురుద్వారాలో ఉంటూ వచ్చానని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది.

బాలిక ఫిర్యాదు ప్రకారం - గత గురుద్వారాలో 21 ఏళ్ల యువకుడు ఆమెను కలిశాడు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అతనితో పాటు అతని స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లింది. ఆ తర్వాత అతను గురుద్వారాలో ఆమెను వదిలేశాడు.

17-year-old raped by youth in car

శనివారంనాడు అతను తన కజిన్‌ను వెంటపెట్టుకుని వచ్చాడు. ఇంటికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. తొలుత నిరాకరించినప్పటికీ తర్వాత ఆమె అందుకు అంగీకరించింది. వారు ఆమెను ఎస్‌యువీలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారు.

కజిన్ కారును నడుపుతుండగా అతను ఆమెపై అత్యాచారం చేశాడు. తిరిగి గురుద్వారాలో ఆ అమ్మాయిని దించేశారు. ఎవరికైనా చెప్తే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. అదివారంనాడు కన్నాట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆమె ఫిర్యాదు చేసింది. ఇద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఆ బాలిక ఇంటి నుంచి రెండుసార్లు పారిపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 17-year-old girl was allegedly raped in a car on Saturday.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి