మట్టిలో మాణిక్యం షాలిని: ఇంటి పనులు చేస్తూనే ఇంటర్‌లో 84.4 శాతం
బెంగుళూరు: తన ముందున్న కష్టాలను జయించి 17 ఏళ్ల ఓ బాలిక ఇంటర్మీడియట్ పరీక్షల్లో 84.4 శాతం మార్కులు సాధించింది. ఆ బాలిక స్వస్ధలం బెంగుళూరు. ఐదు ఇళ్లలో పనిచేస్తేగానీ ఐద వేళ్లు లోపలకుపోని పేద కుటుంబంలో పుట్టింది షాలిని.
ఉదయం లేవగానే బెడ్ కాఫీలు తాగి, బ్రెష్ చేసి కాలేజికి ముస్తాబయ్యే పరిస్ధితి షాలినికి లేదు. తెల్లవారు జామున 4.30 నిమిషాలకు షాలిని దినచర్య మొదలవుతుంది. తన ఇంటి నుంచి మరో ఇంటికి వెళుతూ ఉదయం 9 గంటల వరకూ పాచి పని చేస్తుంది.
ఆ తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి ఒక ముద్దు తిని మళ్లీ పనుల్లోకి పోతుంది. ఇలా చేస్తూ ఎస్‌జీపీటీఏ దీక్ష కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. షాలిని ఏడవ తరగతి వరకు తమిళ మీడియంలో చదివింది. ఆ తర్వాత పది వరకు కన్నడ మీడియంలో చదివింది.

ఇక ఇంటర్మీడియట్ ఇంగ్లీషు మీడియంలో చదివింది. ఇలా ఇన్ని మీడియాలు మారినప్పుడు కష్టంగా అనిపించలేదా అని అడిగినప్పుడు... ఇంట్లో ఉన్న సవాళ్లు ముందు అవి చాలా చిన్నవిగా అనిపించాయని నవ్వుతూ చెప్పింది.
పగలంతా పనిచేస్తూ ఉంటావు కదా, మరెప్పుడు చదువుతావు అన్న ప్రశ్నకుగాను రాత్రుళ్లు పొద్దుపోయాక చదువుతాను. ఐఏఎస్ కావడమే నా ఆశయం అంటూ ఇంగ్లీషులో చక్కగా చెప్పింది. షాలిని తండ్రి పదేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడి మంచానికే పరిమతమయ్యాడు.
అప్పటి నుంచి ఆమె తల్లి పది ఇళ్లలో పాచి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకోస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో తన అన్నయ్యకు బ్లడ్ క్యాన్సర్ రావడంతో ఆసుపత్రిలోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో తన ఉత్తీర్ణత శాతం తగ్గిందని, లేకుంటే ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications