Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

19 ప్రతిపక్ష పార్టీల కీలక ప్రకటన- లిస్ట్‌లో లేని టీడీపీ, బీఆర్ఎస్‌

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం.. ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాలకు దారి తీస్తోంది. దేశానికి ప్రథమ పౌరుడు, రాజ్యాంగానికి అధినేతగా భావించే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ- మోదీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోన్నారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ఇది- రాష్ట్రపతి హోదాను అవమానించడమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను రాష్ట్రపతిని చేసినట్లు చెప్పుకొంటోన్న బీజేపీ- ఆమెను కించపరుస్తోందనే అభిప్రాయాలు లేకపోలేదు.

19 opposition parties decided to boycott the inauguration of the new Parliament building on May 28

మోదీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోన్నారంటూ అటు ప్రతిపక్ష పార్టీలు సైతం మండిపడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. దీనికి గల కారణాన్ని వివరిస్తూ ఓ జాయింట్ స్టేట్‌మెంట్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేశాయి. పార్లమెంట్ భవనం అనేది ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సూచికగా, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా అభివర్ణించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం- పార్లమెంట్‌లో రాష్ట్రపతికీ సభ్యత్వం ఉంటుందని గుర్తు చేశాయి.

అలాంటి భవనం ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రపతిని దూరం పెట్టడం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశాయి. పార్లమెంట్ భవనం అనేది బీజేపీ- దాని అనుబంధ పార్టీల ఆస్తికాదంటూ ధ్వజమెత్తాయి. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు 19 ప్రతిపక్ష పార్టీలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

ఈ ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సమాజ్‌వాది పార్టీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగల్ కచ్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే నాయకులు ఈ జాయింట్ స్టేట్‌మెంట్ సంతకం చేశారు.

కాగా- ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి పేర్లు లేవు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ.. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి పలు ఆందోళనల్లో పాల్గొన్నారు కూడా. ఇప్పుడాయన మళ్లీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో చంద్రబాబును ప్రతిపక్షాలు దూరం పెట్టాయి. ఇక థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న భారత్ రాష్ట్ర సమితిని కూడా ప్రతిపక్షాలు తమ జాబితాలో చేర్చలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+