యూరిన్ పోసి, మలం తినిపించే యత్నం : తమిళనాడులో దారుణం, ఇద్దరి అరెస్ట్, పరారీలో ఒకరు
తిరువూరు : ఉత్సవ నిర్వహణలో మొదలైన గొడవ మలం తినిపించేంత వరకు వెళ్లింది. ముగ్గురు కలిసి దళితుడిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనిపై యురిన్ పోసి పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నారు. వారి పిచ్చి పీక్‌కి చేరి .. మైండ్ పనిచేయకుండా పోయి, మలం తినిపించేంత వరకు వెళ్లింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కారణమిదీ ..
తిరువూరు జిల్లా తిరుమందైరైకి చెందిన కొల్లిమల్లై (43) దళితుడు. ఇక్కడే బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అయితే గ్రామంలో జరిగే ఉత్సవం సమయంలో ముగ్గురు యువకులతో కొల్లిమలైకి గొడవ జరిగింది. దీనిని మనసులో పెట్టుకున్న యువకులు .. కొన్నిరోజుల క్రితం ఇంటికొస్తున్న కొల్లిమలైను ఆటకాయించి దాడి చేశారు. అతనిపై మూత్రం పోసి .. మలం తినిపించేందుకు ప్రయత్నించారు. తనను జరిగిన అవమానం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇద్దరి అరెస్ట్ .. పరారీలో ఒకరు
బాధితుని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శక్తివేల్, రాజేశ్, రాజకుమార్ అనే కొల్లార్ కులానికి చెందిన ముగ్గురి కోసం విసృతంగా గాలించారు. అయితే సోమవారం శక్తివేల్, రాజేశ్‌ను అరెస్ట్ చేశారు. వీరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. రాజకుమార్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు.

ఉపేక్షించొద్దు ..
దళితునిపై దాడిచేసి, అసభ్యంగా ప్రవర్తించినందుకు 341, 294బీ, 352, 506 (2) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ముగ్గురు యువకులపై కఠినచర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications