ఢిల్లీలు కాల్పుల కలకలం: ఇద్దరి అంతం
న్యూఢిల్లీ: దేశ రాజదాని న్యూఢిల్లీలో తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో న్యూఢిల్లీలో గ్యాంగ్ వార్ లు ఎక్కువ అవుతున్నాయి. అనేక మంది తుపాకుల తూటాలకు బలి అయ్యారు. ఇప్పుడు అలాంటి తుపాకుల తూటాలకు ఇద్దరు వ్యక్తులు బలి అయ్యారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హత్యకు గురైన ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇప్పటి వరకు తెలియడం లేదని శనివారం పోలీసులు చెప్పారు. తుపాకి కాల్పులు జరిగి ఇద్దరు హత్యకు గురైనారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

హత్యకు గురైన ఇద్దరిని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కౌన్సిలర్ క్రిష్ణ పెహల్వాన్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఈ రెండు హత్యలు జరిగాయని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications