వంట ఆలస్యమైందని గొడవ: విద్యార్థి దహనం

2 students held after killing 12-yr-old, setting body afire
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో దారుణం జరిగింది. కాంచీపురంలోని అనాథ ఆశ్రమంలో ఓ విద్యార్థిని సహచర విద్యార్థులు హత్య చేసి ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో అతని శరీరాన్ని కాల్చివేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓలి మహ్మద్‌పేటలోని సత్యజ్యోతి కరుణాయి ఇళ్లం ఆశ్రమంలో సుమారు 55 మంది విద్యార్థులు ఉంటున్నారు.

కాగా ఆశ్రమ వార్డెన్ కర్మెగం గురువారం సాయంత్రం ఓ విద్యార్థికి సంబంధించిన కాలిన మృతదేహాన్ని ఆశ్రమం టెర్రాస్‌పై చూశాడు. ఆ తర్వాత ఆ మృతదేహం 5వ తరగతికి చెందిన చిన్నా మురుగన్‌దిగా గుర్తించాడు. వార్డెన్ సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించిన వివరాలను వార్డెన్ కర్మెగంను అడిగి తెలుసుకున్నారు.

మురుగన్‌ను చివరిసారిగా తన సహచరునితో చూసినట్లుగా వార్డెన్ పోలీసులకు తెలిపాడు. మురుగన్ సహచర విద్యార్థిని పోలీసులు ప్రశ్నించగా.. తనకు నేరానికి సంబంధించి ఏమి తెలియదని, హత్య జరిగిన రోజు సాయంత్రం కంప్యూటర్ క్లాసుకని చెప్పి తన మరో స్నేహితునితో వెళ్లిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత మరో స్నేహితున్ని ప్రశ్నించగా.. పోలీసులకు తొలి అనుమానితుడు అబద్ధం చెప్పినట్లుగా గుర్తించారు. వారిద్దరూ కూడా క్లాసులకు గురువారం రోజు హాజరు కాలేదని తెలుసుకున్నారు.

కాగా పోలీసులు తమ విచారణలో బాధితున్ని ఆ ఇద్దరు మైనర్ స్నేహితులే హత్య చేశారని తేల్చారు. మురుగన్ వంట మనిషి అయిన పార్వతికి సహాయం చేస్తుండేవాడని, ఆమెకు వినికిడి సమస్య ఉందని పోలీసులు తెలిపారు. గురువారం ఆమె వంట చేయడం కొంత ఆలస్యం జరిగింది. అయితే వంట ఎందుకు ఆలస్యమైందని అనుమానితులు మురుగన్ ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. అయితే మురుగన్ మిగితా బాలురతో విషయం చెప్పగా వారు స్పందించకపోవడంతో కొంత అసహనానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మురుగన్ ఆశ్రమం మొదటి అంతస్తుకు వెళ్లగా.. అతన్ని వెంబడించిన అనుమానితులు మురుగన్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మరికొందరు విద్యార్థులు కూడా దాడికి సహకరించినట్లు తెలుస్తోందని పోలీసు పేర్కొన్నారు. స్పృహ కోల్పోయిన మురుగన్‌ను టెర్రాస్‌పైకి తీసుకెళ్లిన ఇద్దరు విద్యార్థులు, వంట గదిలోని కిరోసిన్‌ను తీసుకుని అతన్ని తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత కిందికి వచ్చిన అనుమానితులు ఇతర విద్యార్థులతో కలిసిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు అనుమానిత విద్యార్థులను సేదాపేటలోని బోర్‌స్టల్ పాఠశాలకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఆశ్రమాన్ని మూసివేసి, అందులోని విద్యార్థులను ప్రభుత్వ హోమ్స్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+