ఎదురుకాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు హతం, కొనసాగుతున్న వేట
బుధవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారాలో చోటుచేసుకుంది.
శ్రీనగర్: బుధవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారాలో చోటుచేసుకుంది.
కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం.
దీంతో భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవేట ప్రారంభించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

ప్రతిగా భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కాగా, హోలీ పండగ రోజున కూడా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications