షాక్: టెక్కీలపైనే లైంగిక వేధింపులు ఎక్కువ, రోజూకు 2 కేసులు, ఈ రాష్ట్రాల్లోనే అధికం

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు అధికంగా చోటు చేసుకొంటున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.పని ప్రదేశాల్లో రోజుకు ఇద్దరు మహిళలు వేధింపులకు గురయ్యారని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రతి రోజూ సగటున జాతీయ మహిళా కమిషన్ 1.7 ఫిర్యాదులను స్వీకరిస్తోందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం వేధింపులు ఆగడం లేదు. పనిచేసే చోట మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురౌతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అయితే పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకొనే విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు కూడ లేక.పోలేదు.ఇవి కూడ ఒక రకంగా మహిళలపై లైంగిక వేధింపులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

 సాఫ్ట్‌వేర్ రంగంలోనే మహిళలపై లైంగిక వేధింపులు

సాఫ్ట్‌వేర్ రంగంలోనే మహిళలపై లైంగిక వేధింపులు

టెన్నాలజీ కంపెనీల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు అధికంగా చోటు చేసుకొంటున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ ఏడాది జనవరి 1 డిసెంబర్‌ 12 మధ్య 316 రోజులకు గాను ఎన్‌సీడబ్ల్యూకు 539 ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక దశలో పరిష్కారం కాని కేసులు చివరికి మహిళా కమిషన్‌ వద్దకు చేరుతున్నాయి.

 ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ

ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ

ఈ ఏడాది ఇప్పటివరకు మహిళలపై చోటు చేసుకొన్న లైంగిక వేధింపుల కేసుల్లో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే చోటు చేసుకొన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు మహిళా కమిషన్‌కు అందిన 539 ఫిర్యాదుల్లో 60 శాతం కేసులు యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల నుండి వచ్చినవే.

 పనిచేసే చోట లైంగిక వేధింపులపై తక్కువ ఫిర్యాదులు

పనిచేసే చోట లైంగిక వేధింపులపై తక్కువ ఫిర్యాదులు

కార్యాలయాలు, పనిప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపుల్లో ఫిర్యాదులు అందేవి చాలా తక్కువ కేసులేనని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కమిషన్‌ దృష్టికి రాకుండా శాఖాపరమైన విచారణల్లో వందల కేసులున్నట్టు సమాచారం. లైంగిక వేధింపుల చట్టాల ప్రకారం మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను తొలుత అంతర్గత ఫిర్యాదుల కమిటీ, జిల్లా ఫిర్యాదుల కమిటీలు పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి.

 లైంగిక వేధింపులు..కంపెనీలపై చర్యలు

లైంగిక వేధింపులు..కంపెనీలపై చర్యలు

లైంగిక వేధింపుల ఫిర్యాదులపై స్పందించని కంపెనీలపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దీన్ని సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.ప్రతి పది సంస్థల్లో ఎనిమిది కంపెనీల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు కమిటీలు లేవని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 లైంగిక వేధింపులకు ఇలా..

లైంగిక వేధింపులకు ఇలా..

వృత్తిపరమైన వేధింపులు చివరికి లైంగిక వేధింపులకు దారితీస్తున్నాయని కర్ణాటక మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మీబాయ్‌ చెప్పారు. లైంగిక వేధింపుల కేసులు ప్రధానంగా ఐటీ కంపెనీల నుంచే అధికంగా వస్తున్నాయని అన్నారు. లైంగిక వేధింపుల నివారణకు ముందస్తు చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+