పిల్లలతో సహా బంధించి.. 32 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మహిళల పైన అత్యాచారాలు ఆగడం లేదు. బదాన్‌లో తాజాగా మరో అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. 32 ఏళ్ల ఓ మహిళను నిర్బంధించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, వారిలో ఒకరు పోలీసు ఉద్యోగి కుమారుడని స్థానిక పోలీసులు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఆ మహిళ మెడిసిన్స్ కొనడానికి ఇద్దరు కుమారులతో కలసి బయటికి వచ్చింది. ఆ సమయంలో హిమాంశు అనే వ్యక్తి ఆమెను పిల్లలతో సహా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నిర్బంధించాడు.

తర్వాత మరో ఇద్దరితో కలిసి వచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను శనివారం విడిచిపెట్టడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరైన హిమాంశు పోలీసు అధికారి కుమారుడని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిమాంశు, ఖలీఫా, మరో వ్యక్తి పన పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications