కేరళలో కొండచరియల బీభత్సం.. 42 మంది మృతి.. ఆర్థికసాయం ప్రకటించిన ఫడ్నవీస్
తిరువనంతపురం : దక్షిణాదిలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేరళలో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడి ఆచూకీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మల్లప్పురంలో ఓ వ్యక్తి కళ్ల ముందే తల్లి, భార్య, కుమారుడు కొండచరియలు విరిగిపడి కురుకుపోవడం భయాందోళన కలిగించింది. కేరళలో కొండచరియలు విరిగిపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.
వర్ష బీభత్సం ..
కేరళపై ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 988 పునరావాస కేంద్రాలకు దాదాపు లక్ష మందిని తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. వాయనాడులో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడి 42 మంది చనిపోయారు. వీరిలో కోజికోడ్, మలప్పురం జిల్లాలకు చెందిన వారు 20 మది ఉన్నారు. వాయనాడుకు చెందిన వారు 9 మంది ఉన్నారు. నిన్న ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పలాక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడు, కన్నూరు, కేసర్ ఘడ్‌లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో కోచి విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు 20 రైళ్లను కూడా రద్దుచేశారు. మరికొన్నింటి మార్గాలను మళ్లిస్తున్నట్టు రైల్వేశాఖ అధికారలుు వెల్లడించారు.

కళ్లముందే ..
మరోవైపు మల్లప్పురంలో ఓ ఫ్యామిలీ కొండచరియలు విరిగిపడి బురదలో చిక్కుకుంది. కొట్టకున్నుకు చెందిన శరత్ ఇంటి బయట తన తల్లి సరోజనితో మాట్లాడుతున్నాడు. అంతలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. తన తల్లిని కాపాడేందుకు శరత్ విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆమె బురదలో చిక్కుకుపోయింది. ఇంటిపై కొండచరియలు విరిగిపడటంలో ఇంట్లో ఉన్న శరత్ భార్య గీతు, ఏడాదిన్నర కుమారుడు కూడా బురదలో చిక్కుకుపోయారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. శరత్ తల్లి, భార్య, కుమారుడు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేరళలోని మలప్పురంలో కొండచరియలు విరిగిపడి 30 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. వారిని కాపాడేందుకు సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొండచరియలు విరిగిపడి చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.

వడోదర వీధుల్లో మొసళ్లు
కేరళతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వర్షపునీరుతో వడోదరలో మొసళ్లు వీధుల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వీటిని చూసి భయబ్రాంతుకుల గురైన జనం .. తర్వాత వాటితో ఆడుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఓ వ్యక్తి మొసళిపై తాడుబొంత వేసి .. దానిని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన వీడియో తెగ ట్రెండ్ అయ్యింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications