క్రైమ్ షోను కాపీ చేస్తూ బాలిక ఉరేసుకుంది: భయంతో మిత్రుల పరార్
లక్నో: పొరపాటున ఉరిపడి 8 ఏళ్ల బాలిక మరణించింది. టెలివిజన్‌లో ప్రసారమవుతున్న ఓ క్రైమ్ షోతో ప్రేరణ పొంది మిత్రురాలి ఇంటిలో ఉరి వేసుకున్నట్లు నటించేందుకు ప్రయత్నించింది. అయితే, ఉరి బిగుసుకోవడంతో ఆమె మరణించింది.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. ఆమె మిత్రులు ఎవరినీ అప్రమత్తం చేయకుండా భయంతో పారిపోయారు. ఇంట్లో దెబ్బలు కొట్టడతో ఏడుస్తూ ఆమె తమ ఇంటికి వచ్చిందని, టీవీలో తాము ఓ క్రైమ్ షో చూశామని, దాంతో పోలీసు - పోలీసు ఆట ఆడాలని నిర్ణయించుకున్నామని, ఆటాడుతుండగా ఆమె ఉరివేసుకుందని స్నేహితురాలు పోలీసులతో చెప్పింది.
ఇంట్లో తీవ్ర అసంతృప్తికి గురైన బాలిక ఆడుకోవడానికి పొరుగింటికి వచ్చిందని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి చెప్పారు. టీవీలో పాపులర్ క్రైమ్ షోలో ఉరి వేసుకున్న దశ్యాన్ని చూశారని చెప్పారు.
పిల్లలను దాన్ని అనుకరించడానికి ప్రయత్నించారని, బాలిక బకెట్‌పైకి ఎక్కి దుపట్టాను మెడ చుట్టూ కట్టుకుని ఉరేసుకుందని చెప్పారు. బాలిక మరణించిందని గుర్తించిన పిల్లలు భయంతో పారిపోయారని అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications