ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి బెదిరింపు లేఖ
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఫ్రెంచ్ రాయబారి కార్యాలయానికి బెదిరింపు లేఖ రాశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోల్లాండ్ భారత గణతంత్ర దినోత్స వేడుకులకు హాజరుఅవుతున్నారని, తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆ లేఖలో రాశారని వెలుగు చూసింది.
ఈ బెదిరింపు లేఖపై బెంగళూరు పోలీసులు ఈ నెల 14వ తేదిన కేసు నమోదు చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు భారత్ పర్యటనను వ్యతిరేకిస్తూ చెన్నై నగరం నుంచి బెదిరింపు లేఖ రాశారని బెంగళూరు నగర పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
ఇంగ్లీష్ బాషలో ఉన్న బెదిరింపు లేఖ చెన్నైలో పోస్టు చేశారని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. అయితే చెన్నైలోని అడ్రస్ మాత్రం కచ్చితంగా తెలియడం లేదని బెంగళూరు కేంద్ర విభాగం పోలీసు అధికారులు అంటున్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు వీక్షించడానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోల్లాండ్ భారత్ వస్తున్న సందర్బంలో ఆయన మీద దాడులు చెయ్యడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
ఇదే సమయంలో బెంగళూరు నగరంలోని ఫ్రెంచ్ కార్యాలయానికి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మీద వైమానిక దాడులు చేస్తున్న ఫ్రెంచ్ దేశ అధ్యక్షుడిని బెదిరించడానికి ఓ వర్గం వారు ఇలా బెదిరింపు లేఖ పంపించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications