ఫస్ట్ ప్రియుడితో ఫస్ట్ రౌండ్, సెకండ్ లవర్ తో సెకండ్ రౌండ్, కాలేజ్ అమ్మాయి ఫుల్ బిజీ !

తిరువనంతపురం/ఎర్నాకుళం: డిగ్రీ కాలేజ్ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ తో ఆమె రొమాన్స్ చేసింది. అదే కాలేజ్ లో సీనియర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేసింది. మొదటి ప్రియుడు అడ్డుపడుతున్నాడని అతన్ని ఫ్రెండ్స్ తో కలిసి కిడ్నాప్ చేసిన కాలేజ్ అమ్మాయి అతన్ని నగ్నంగా చేసి అతని శరీరాన్ని సిగరేట్లతో కాల్చి టార్చర్ పెట్టింది.

కేరళలోని తిరువనంతపురం సమీపంలోని వర్కాల చెర్నూర్‌కు చెందిన లక్ష్మీప్రియా అలియాస్ ప్రియా (19) అనే యువతి డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నది. లక్ష్మీ ప్రియాకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి మధ్య కొంతకాలం ప్రేమాయణం నడిచింది. తరువాత కాలేజీలో చదువుతున్న ఓ సీనియర్ విద్యార్థినితో లక్ష్మీ ప్రియా అక్రమ సంబంధం పెట్టుకుంది.

కాలేజ్ లో సీనియర్ విద్యార్థి, లక్ష్మి ప్రియాల మధ్య రొమాన్స్ ఎక్కువ అయ్యింది. ఈ కారణంతో లక్ష్మీ ప్రియా ఆమె మొదటి ప్రియుడికి దూరం అయ్యింది. దీంతో ఆవేదన చెందిన మొదటి ప్రేమికుడు లక్ష్మి ప్రియాను కలుసుకుని తన ప్రేమను వదులుకోవద్దని మనవి చేశాడు. అయితే లక్ష్మీ ప్రియా మాత్రం కాలేజ్ ప్రియుడి మోజులో పీకల్లోతులో మునిగిపోయింది.

girlcheatingboyfriend

రెండో ప్రేమికుడిపై మోజుతో ఫస్ట్ ప్రేమికుడిని మరిచిపోయిన లక్ష్మీప్రియా తనతో మాట్లాడవద్దని, అలా మాట్లాడితే తన కొత్త ప్రియుడికి కోపం వస్తుందని ఫస్ట్ ప్రియుడిని హెచ్చరించింది. అయితే ఫస్ట్ ప్రేమికుడు లక్ష్మి ప్రియాను పదేపదే కలవడానికి ప్రయత్నిస్తూనే వచ్చాడు. దీంతో రగిలిపోయిన లక్ష్మీ ప్రియా ఇటీవల తనను ఏకాంతంగా కలవాలని ఫస్ట్ ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.

లక్ష్మీ ప్రియా మాటలు నమ్మిన మొదటి ప్రియుడు లక్ష్మీప్రియా పిలిచిన ప్రాంతానికి ఒంటరిగా వెళ్లాడు. అక్కడ లక్ష్మి ప్రియాతో పాటు ఆమె రెండో బాయ్ ఫ్రెండ్ అతని స్నేహితులు కొందరు ఉన్నారు. లక్ష్మీ ప్రియా బాయ్ ఫ్రెండ్ అతని సహచరులతో కలిసి మొదటి ప్రియుడిపై దాడి చేసి కారులో అతన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఫస్ట్ ప్రియుడిని ఆరోజంతా హింసించారు. ఫస్ట్ ప్రియుడిని నగ్నంగా చేసి అతని శరీరమంతా సిగరెట్లతో కాల్చి టార్చర్ పెట్టారు. ఇంకోసారి లక్ష్మీ ప్రియా జోలికి వస్తే నిన్ను చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ లాక్కుని అతన్ని రోడ్డు పక్కన వదిలేసి అక్కడి నుంచి లక్ష్మీ ప్రియా, ఆమె రెండో బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితులు పరారైనారు.

girlcheatingboyfriend

తన కొడుకు కనిపించడం లేదని ఫస్ట్ ప్రియుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యువకుడి కోసం గాలించగా శరీరం మొత్తం గాయాలతో అతను రోడ్డుపై పడి ఉన్న వియం గుర్తించి అతడిని ఆస్పత్రిలో చేర్చించారు. రెండవ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తన మాజీ ప్రియురాలు లక్ష్మీ ప్రియా తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని బాధితుడు పోలీసులకు చెప్పాడు.

పోలీసులు లక్ష్మీ ప్రియాను పట్టుకునేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా లక్ష్మీ ప్రియా ఎర్నాకుళం ప్రాంతంలో తలదాచుకున్నదని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ ప్రియాతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ తో సహ మొత్తం ఏడు మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

లక్ష్మీ ప్రియా తల్లి స్థానిక మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె, బాధితుడు ఇద్దరూ స్నేహితులని, వారు ప్రేమించుకోలేదని, బాధితుడు పదేపదే తన కూతురి మొబైల్ కి అసభ్య ఫోటోలు, వీడియోలు పంపించి తనతో మాట్లాడాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని రివర్స్ కేసు పెట్టానని చెప్పింది. కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+