టీ తాగేందుకు వెళ్తే.. రూ.20 కోసం కాల్చి చంపేశారు
లక్నో: చిన్నగా మొదలైన ఓ గొడవ రూ. 20 కోసం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భగవంతపురలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భగవంతపుర ప్రాంతానికి చెందిన రామేశ్వర్ జీవనోపాధికి గుర్రం బండి నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం గ్రామంలోని ఓ దుకాణానికి టీ తాగడానికి వెళ్లాడు.
అక్కడ దుకాణ యజమానితో రామేశ్వరం రూ.20 కోసం గొడవపెట్టుకున్నాడు. మాటా మాటా పెరిగి గొడవ కాస్తా పెరగడంతో దుకాణ యజమాని సోదరుడు రామేశ్వరంపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

ఆ తర్వాత అన్నాదమ్ములు అతని మృతదేహాన్ని ఊరు చివర పడేసి వెళ్లిపోయారు. రెండు రోజులుగా భర్త ఇంటికి రాకపోవడంతో రామేశ్వరం భార్య పోలీసులను ఆశ్రయించింది. అతని కోసం గాలిస్తుండగా గ్రామానికి కిలోమీటరు దూరంలో రామేశ్వరం మృతదేహం దొరికింది.
విచారణ చేపట్టగా దుకాణ యజమాని అతని సోదరుడు.. రామేశ్వరాన్ని రూ. 20 కోసం చంపేసినట్లు తెలిసింది. దీంతో వెంటనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications