కావేరీ రగడ: సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడరాదు
బెంగళూరు: కావేరీ జలాలు పంపిణి చెయ్యరాదని ఓ నిర్ణయం తీసుకోవడానికి కర్ణాటక ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాలే ఉంది. ఈ సమావేశాలలో మాట్లాడటానికి సీనియర్ నాయకులకు మాత్రమే అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్, నైస్ సంస్థల అధినేత, మక్కల్ పార్టీ శాసన సభ్యుడు అశోక్ ఖైణి, జేడీఎస్ కు చెందిన వైవీఎస్ దత్తలకు ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు.

ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు( బీజేపీ ) జగదీష్ శెట్టర్ ఆధ్వర్యంలో బీజేపీ శాసన సభ్యులు కావేరీ జలాల విషయంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ శాసన సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని జగదీష్ శెట్టర్ సభలో వివరించనున్నారు.
కావేరి సమస్యపై సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడరాదని కర్ణాటక స్పీకర్ మనవి చేశారు. ఉభయ సభల నాయకులు చెప్పే మాటలు, తుది నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా నమోదు చెయ్యడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నీ సిద్దం చేశారు.












Click it and Unblock the Notifications