మారుతున్న లెక్కలు - కలిసొచ్చేదెవరికి..!!
ఢిల్లీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్రిముఖ పోటీలో మూడు ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఎన్నికల హామీలు గుప్పించాయి. నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారనే అంశం పైన స్పష్టత వస్తోంది. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోల మాత్రం ఓటరు నాడి పార్టీలకు అంతు చిక్కటం లేదు. మహిళా ఓటింగ్ ఈ సారి కీలకంగా మారబోతోంది. ఇదే సమయంలో గెలుపు పైన కొత్త అంచనాలు తెర మీదకు వచ్చాయి.
హోరా హోరీ పోరు
ఢిల్లీలో మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,040 నామినేషన్లు దాఖలు కాగా, ఉప సంహరణల తరువాత 981 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించి, 477 తిరస్కరించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రుల కుమారులైన బిజెపికి చెందిన పర్వేష్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు), కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కుమారుడు) న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్‌తో తలబడుతున్నారు. ఈస్థానం నుంచి అత్యధికంగా 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు 23 మంది పోటీలో నిలిచారు.

పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
అదే విధంగా పటేల్ నగర్, కస్తూర్భా నగర్ స్థానాల్లో అత్యల్పంగా ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందనేది గమనించిన పార్టీలు.. ఇప్పుడు వారిని తమ వైపు తిప్పుకునేందుకు భారీగా హామీలు ఇస్తున్నాయి. సగం ఓట్లు మహిళలవే కావటంతో నగదు సాయం తో పాటుగా వారి కోసం కొత్త పథకాలను మేనిఫెస్టోల్లో చేర్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకుంటే, 38.51శాతం ఓట్లతో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 4.26 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేదు.
కలిసొచ్చేదెవరికి
కానీ, కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 54.35 శాతం ఓటర్లు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కు 18.91 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, ఆప్ కు 24.17 శాతం మంది ఓటర్లు మద్దతు ఇచ్చారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ద్వారా బీజేపీ ఢిల్లీలోనే తమదే విజయం అనే ధీమాతో ఉంది. కాంగ్రెస్ - ఆప్ వేర్వేరుగా పోటీలో ఉండటం తో తమకు కలిసి వస్తుందని అంచనాతో ఉంది. కాంగ్రెస్ గ్యారంటీలనే నమ్ముకోగా.. ఆప్ ఈ సారి గెలుపుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో, ఓటర్ల తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications