విషాదం:సెల్పీ కోసం స్నేహితుడితో ఇలా...లోయలో అలా...
సెల్పీ సరదా ఓ యువకుడి ప్రాణాలను తీసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. మునీర్ అహ్మద్ సెల్పీ తీసుకొంటుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడు.
డెహ్రడూన్ :సెల్పీ మోజు ప్రాణాల మీదికి తెస్తోంది. సెల్పీల కోసం అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ తరహ వార్తలు మనం రోజూ చూస్తూనే ఉంటున్నాం, వింటున్నాం.అయితే ఇదే తరహ ఘటన ఒకటి ఉత్తరాఖండ్ లో చోటుచేసుకొంది.. ఓ యువకుడు సెల్పీ మోజులో పడి చనిపోయాడు.
డెహ్రడూన్ కు చెందిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మునీర్ అహ్మద్ సెల్పీ తీసుకొంటుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించారు. ఈ ఘటన డెహ్రడూన్ ముసోరి రోడ్డు సమీపంలోని కొలుఖెత్ లో చోటుచేసుకొంది.
ఇద్దరు స్మేహితులు సరదాగా రెండురోజుల పాటు విహరయాత్రకు వెళ్ళి తిరిగి వస్తోండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. కొలుబెత్ సమీపంలో అందమైన ప్రదేశం కన్పించడంతో అక్కడ ఫోటో తీసుకోవాలని ద్విచక్ర వాహనం ఆపారు.

ఫోటో తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి అహ్మద్ లోయలో పడ్డాడు. దీంతో అతడి స్నేహితుడు స్థానికుల సహయంతో కోసం కేకలు పెట్టాడు.కాని, అతడ్ని రక్షించలేకపోయాడు.
రెండు గంటలపాటు కష్టపడి మృతదేహన్ని వెలికితీశారు. తలకు బలమైన గాయం కావడంతో అహ్మద్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications