ఇక మరణ ధ్రువపత్రానికీ ఆధార్ తప్పనిసరి
ఆధార్ నెంబర్ ఇకపై ప్రతీ అంశానికి కీలకం కానుంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు, పాన్ నంబర్లు, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసింది.
న్యూఢిల్లీ: ఆధార్ నెంబర్ ఇకపై ప్రతీ అంశానికి కీలకం కానుంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలు, పాన్ నంబర్లు, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసింది.
తాజాగా మరణ ధ్రువీకరణ పత్రాలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1, 2017 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మరణ ధ్రువీకరణ నమోదుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటన వెలువరిచింది.

అయితే జమ్మూకాశ్మీర్, మేఘాలయ, అసోం రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు కల్పించింది. మరణ ధృవీకరణ పత్రాలకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా చనిపోయిన వారి వివరాలు కూడా ప్రభుత్వానికి తెలుస్తాయి. దీంతో చనిపోయిన వారికి పింఛన్ లాంటి పథకాలు నిలిపేసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications