వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Aarogya Setu:కొత్త స్మార్ట్ ఫోన్లలో యాప్ కంపల్సరీ..? లాక్‌డౌన్ తర్వాత జరిగే విక్రయాల్లో..

|
Google Oneindia TeluguNews

ఆరోగ్య సేతు యాప్.. కోవిడ్-19 గురించిన సమాచారం తెలియజేస్తోంది. యాప్ తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత జరిగే కొత్త మొబైల్ విక్రయాలపై సర్కార్ ఫోకస్ చేసింది. ఆయా ఫోన్లలో తప్పనిసరిగా ఆరోగ్య సేత యాప్ ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త స్మార్ట్ ఫోన్లలో విధిగా ఆరోగ్య సేతు యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మొబైళ్లలో ముందే యాప్ ఉండటంతో ఫోన్ కొనుగోలు చేసిన యూజర్ తప్పనిసరిగా ఆరోగ్య సేతు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ విధిగా ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేసి.. వారికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. దీంతో యాప్ మిగతావాటి మాదిరిగా ఇన్ బిల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఫీచర్ ఫోన్లలో యాప్ గురించి మాత్రం ఆలోచించలేదు. వాస్తవానికి దేశంలో స్మార్ట్ ఫోన్ల కన్నా ఫీచర్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సేతు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 7.5 కోట్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారని తెలుస్తోంది. దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. 5 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు.

Aarogya Setu Registration Will be Mandatory to Setup New Phone

కరోనా వైరస్ కమ్యునిటీ వ్యాప్తిని ఆరోగ్య సేతు యాప్ కచ్చితంగా తెలియజేస్తోంది. జియోలొకేషన్ సెన్సార్, బ్లూ టూత్ వినియోగదారుల స్థానాన్ని తెలియజేస్తోంది. కరోనా వైరస్ ఉన్న రోగుల స్థానాన్ని తెలియజేస్తోంది. అంతేకాదు వారు ఇటీవల విదేశాలకు వెళ్లారా..? ప్రయాణ చరిత్రను కూడా తెలియజేస్తోంది. ఈ క్రమంలో యాప్ కంపల్సరీ చేయడంతో వైరస్ సోకిన వారిని కనుక్కొవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

English summary
Registering on Aarogya Setu will be mandatory for all new smartphones before they can be set up and used, government sources told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X