బిల్డర్ హత్య: గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను దోషిగా తేల్చిన టాడా కోర్టు
ముంబై: ప్రదీప్ జైన్ అనే వ్యక్తి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్‌రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) కోర్టు సోమవారం నాడు 1995లో హతుడైన ప్రదీప్ జైన్ కేసులో తీర్పును చెప్పింది.
ఈ కేసులో అబూ సలేంను దోషిగా తేల్చింది. స్పెషల్ ట్రయల్ జడ్జి.. అబూ సలేం, మెహ్దీ హసన్, బిల్డర్ వీరేంద్ర జాంబ్‌ల పైన విచారణను పూర్తి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్యాంగ్ స్టర్ అబూ సలేం ప్రాపర్టీ విషయంలో ప్రదీప్ జైన్‌ను హత్య చేశారు.

ప్రదీప్ జైన్ ముంబై సిటీ బేస్డ్ బిల్డర్. అతను 1995 మార్చి 7వ తేదీన జుహు బంగ్లా వద్ద హత్యగావించబడ్డాడు. ఈ కేసులో నిందితుడైన నమీమ్ ఖాన్ అప్రూవర్‌గా మారాడు. మరో నిందితుడు రియాజ్ సిద్ధిఖీ కూడా మొదట అప్రూవర్‌గా మారాడు.
పోలీసులు అన్ని కోణాల్లో విచారించి అబూ సలీమ్ ఇతరుల పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. సిద్ధిఖీ పోలీసు విచారణలో అబూ హత్యలో అబూ సలేం పాత్రను చెప్పాడు. విచారణలో అతను నిందితుడిగా తేలాడు. కాగా, అబూ సలేం 1993 ముంబై సీరియల్ బాంబు బ్లాస్ట్ కేసుల్లో నిందితుడు కూడా.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications