కశ్మీర్‌లో ప్రమాదం, లోయలోకి దూసుకెళ్లిన క్యాబ్, 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాబ్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్ జిల్లాలో గల మర్వా ప్రాంతం వద్ద యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళుతున్న క్యాబ్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఎనిమిది మంది చనిపోయారు.

స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను లోయ నుంచి వెలికి తీశారు. ప్రమాదానికి గురైన వాహనం ఓ టాటా సుమో అని తెలిపారు. ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యధిక భాగం పర్వత ప్రాంతం ఉంది. మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications