అంతా సిద్దే చేశాడు..? రైతు నేతల సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ కూడా.. అబ్బే అదేం లేదట..?
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసతో హై టెన్షన్ నెలకొంది. అయితే ఆందోళనకారులను నటుడు, సింగర్ దీప్ సిద్దు రెచ్చగొట్టారని హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ గుర్నామ్ సింగ్ చాదునీ ఆరోపించారు. వారిని సిద్దు తప్పుదోవ పట్టించాడని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆందోళనతో రైతు నేతలకు ఏం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

ఎర్రకోటకు ఎలా..?
కొందరీతో ఉన్న సమూహం ఎర్ర కోటకు వెళ్లిందని గుర్నామ్ తెలిపారు. వాస్తవానికి తాము ఎర్రకోటకు వెళ్లాలని అనుకోలేదని చెప్పారు. అక్కడ పతాకం ఎగరవేశారని వివరించారు. ఇదీ కేవలం సిద్దు ప్రేరేపించడం వల్ల మాత్రమే జరిగిందని వెల్లడించారు. గుర్నామ్ ఆరోపణలను స్వరాజ్ ఇండియా లీడర్ యోగేంద్ర యాదవ్ కూడా అంగీకరించారు. ఆయన వల్లే ఎర్రకోట వద్ద భీతవాహ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అడ్డుకునేందుకు శతవిధలా ప్రయత్నించామని వివరించారు. కానీ పరిస్థితి చేయిదాటి పోయిందని చెప్పారు.

క్షమించరాని నేరం
ఎర్రకోట వద్ద జరిగిన ఘటన మాత్రం క్షమించరానిది అని చెప్పారు. తమతో ఉన్నవారంతా దేశబంధువులు అని.. తొలిరోజు నుంచి అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. కానీ ఇవాళ జరిగిన ఘటనతో అందరికీ చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇంతకీ దీప్ సిద్దు ఎర్ర కోట వద్దకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను సిద్దు పలుమార్లు రెచ్చగొట్టాడని.. అందుకే వారు అలా చేశారని పేర్కొన్నారు.

బీజేపీతో సన్నిహిత సంబంధాలు
దీప్ సిద్దుకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాదు ఎంపీ సన్నీ డియోల్ ఎన్నికల సందర్భంలో ఏజెంట్‌గా కూడా పనిచేశారని తెలిపారు. ప్రధాని మోడీతో కూడా పలు సందర్భాల్లో కనిపించారని వివరించారు. దీనికి సంబంధించి తాము పోలీసులకు తెలిపామని.. కానీ వారు ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. వీరితోపాటు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కూడా హింసకు బాధ్యత వహించాలని చెప్పారు.
Recommended Video

సిద్దు బాధ్యుడు
ఘటనకు సిద్దు బాధ్యుడని కాంగ్రెస్ ఎంపీ రవ్ నీత్ సింగ్ బిట్టు తెలిపారు. అతను సిక్కులకు న్యాయం చేయాలనే అతివాద భావజాలంతో ఉంటారని తెలిపారు. కానీ దీప్ సిద్దు మాత్రం తాము శాంతియుతంగా నిరసన తెలియజేశామని.. జాతీయ జెండాను తొలగించలేదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications