మని పవర్ రాజకీయాలు, మార్పు కోసం పోరాటం, రియల్ స్టార్ ఉపేంద్ర, ఎన్నిసీట్లు వస్తాయో!

బెంగళూరు: ఉత్తమ ప్రజాకీయ పార్టీ (UPP)వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు ఉపేంద్ర సోమవారం మండ్యలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మని పవర్ రాజకీయాల్లో మార్పు కోసం పోరాటం అంటూ ఉపేంద్ర ప్రచారం చేస్తున్నారు. మండ్యలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి సుమలత అంబిరీష్ కు మద్దతుగా స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రచారం చేస్తున్నారు.

ప్రముఖ హీరోల ప్రచారంతో మండ్య లోక్ సభ నియోజక వర్గం హోరెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హీరో ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు వ్యాపారం అయ్యాయని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ఉత్తమ ప్రజాకీయ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఉపేంద్ర అన్నారు.

Actor Upendra started election campaign for UPP candidate in Mandya.

ఉత్తమ ప్రజాకీయ పార్టీ డ్రస్ కోడ్ తో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని ఉపేంద్ర చెప్పారు. 14 లోక్ సభ నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని, త్వరలో తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ఉపేంద్ర వివరించారు.

ప్రస్తుత రాజకీయాలు ప్రజల చేతుల్లో ఉందని, జాతి, మతం, డబ్బుతో ప్రస్తుత రాజకీయాలు ముడిపడి ఉన్నాయని హీరో ఉపేంద్ర అన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడం తమ పార్టీ ప్రస్తుత కర్తవ్యం అని, ఈ విషయంతో తాము విజయం సాదిస్తామనే నమ్మకం ఉందని ఉపేంద్ర చెప్పారు.

ప్రజా సేవ అనేది ప్రస్తుతం మని పవర్ తో ముడిపడి ఉందని, ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపేంద్ర అన్నారు. రోడ్ షోల మీద తమకు నమ్మకం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని హీరో ఉపేంద్ర తెలిపారు. ఎన్ని సీట్లలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాదిస్తారో తాను అంచనా వెయ్యలేనని, ప్రజలు ఆశీర్వాదం తమకు ఉందని హీరో ఉపేంద్ర తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+