నటిని ఫోటోలు తీసిన ఫోన్ సహా..: లై డికెక్టర్‌కు నిందితుడు నో

తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించవద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కేరళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ కోర్టుకు చెప్పాడు.

తిరువనంతపురం: తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించవద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కేరళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ కోర్టుకు చెప్పాడు.

పల్సర్ సునీల్‌ను అలువా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి కావాలంటే నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు.

ఈ కేసు విచారణకు నిందితుడు సహకరించడం లేదన్నారు. పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న విగీష్, సునీలకు ఈ నెల 10 వరకు పోలీస్ కస్టడీని కోర్టు పొడిగించింది.

ఆ విచారణ అవసరం

ఆ విచారణ అవసరం

నిందితుడు పల్సర్ సునీల్ కేసు విచారణను మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కాబట్టి లై డిటెక్టివ్ పరీక్షలకు అనుమతివ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు ఇలాంటి విచారణ కావాలన్నారు.

ఫోటోలు తీసిన స్మార్ట్ ఫోన్ గురించి..

ఫోటోలు తీసిన స్మార్ట్ ఫోన్ గురించి..

నటిని కిడ్నాప్ చేసిన కారు, అతను పోటోలు తీసిన స్మార్ట్ ఫోన్ విషయంలో నిందితుడు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. అతని నుంచి సరైన సమాధానాలు రావడం లేదని చెప్పారు.

కస్టడీ పొడిగింపు

కస్టడీ పొడిగింపు

మరోవైపు నిందితుల పోలీసు కస్టడీని న్యాయస్థానం మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. ఇంకోవైపు, నటి కేసులో ఛార్జీషీటును నెల రోజుల్లోపు వేయనున్నారు.

వేధింపుల కేసు

వేధింపుల కేసు

మళయాల నటిని కిడ్వాప్ చేసి, వేధించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కారులో రెండు గంటల పాటు నిందితులు ఆమెను వేధించారు. ఈ ఘటన ఫిబ్రవరి 1వ తేదీన జరిగింది. పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+