ఐటీ అధికారుల అదుపులో రష్మిక మందన్న: సమన్లు జారీ..కాస్సేపట్లో విచారణ.. !
బెంగళూరు: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్న చిక్కుల్లో పడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆమె ఇప్పటికే ఐటీ దాడులను ఎదుర్కొంటున్నారు. ఆమె నివాసంలో రోజంతా దాడులను కొనసాగించిన ఐటీ అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిపై మరింత విస్తృత సమాచారాన్ని రాబట్టుకోవడానికి రష్మిక మందన్నను అదుపులోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
Recommended Video

చెన్నై నుంచి సొంతింటికి..
కర్ణాటక కొడగు జిల్లాలోని విరాజ్‌పేటలో గల రష్మిక మందన్న నివాసంపై ఆదాయపు పన్ను దాడులు చోటు చేసుకున్న సమయంలో ఆమె చెన్నైలో ఓ తమిళ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. దాడుల సమాచారం తెలిసినప్పటికీ.. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. తన తండ్రి మదన్ మందన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను మాత్రమే తెలుసుకుంటున్నారని తెలియడంతో రష్మిక.. షూటింగ్‌లోనే ఉండిపోయారు.

సాయంత్రానికి నోటీసులు..
మదన్ మందన్నకు సంబంధించిన ఆస్తుల గురించి ఆరాా తీస్తోన్న సమయంలో అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ రష్మిక మందన్న పేరు మీద ఉండటం వల్ల ఆమెను కూడా విచారించాలని నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం రష్మికకు నోటీసులను జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనితో ఆమె- గురువారం రాత్రికల్లా విరాజ్‌పేటకు చేరుకున్నట్లు సమాచారం.

ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడివి?
రష్మికకు ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడి నుంచి సమకూరాయనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గురువారం రోజంతా ఈ దాడులు, దర్యాప్తులు కొనసాగిన విషయం తెలిసిందే. రష్మికకు గానీ, ఆమె కుటుంబానికి గానీ ఉన్న ఆస్తులు.. వారి ఆదాయానికి మించి ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయనే ఆరోపణలపై ఈ దాడులను చేపట్టారు అధికారులు. ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు.

కాఫీ తోటల కొనుగోలు డబ్బులెక్కడివి?
రష్మిక స్వస్థలం విరాజ్‌పేట శివార్లలో రష్మిక పేరు మీద ఇప్పటికే ఓ 50 ఎకరాల కాఫీ తోట ఉంది. తాజాగా- ఆమె పేరు మీదే మరో 50 ఎకరాల కాఫీ తోటను కొనుగోలు చేయడానికి ఆమె తండ్రి మదన్ మందన్న ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. మదన్ మందన్న పేరు మీద విరాజ్‌పేటలో సెరెనిటీ హాల్, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. విరాజ్‌పేట సమీపంలోని గోణికొప్ప గ్రామంలో ఓ రెసిడెన్షియల్ స్కూల్‌ను నెలకొల్పడానికి రష్మిక తండ్రి ప్రయత్నించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications