నన్ను ఆపడానికి మీరెవరు: మమత, 'బీజేవైఎం నేత తలకు రూ.22 లక్షలు'
తన తల తీసుకు వస్తే రూ.11 లక్షలు ఇస్తానని చెప్పిన బీజేవైఎం యోగేష్ నేత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అలాంటి వారిని దేవుడు క్షమించాలని తాను ప్రార్థన చేస్తున్నానని దీదీ చెప్పారు.
కోల్‌కతా: తన తల తీసుకు వస్తే రూ.11 లక్షలు ఇస్తానని చెప్పిన బీజేవైఎం యోగేష్ నేత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అలాంటి వారిని దేవుడు క్షమించాలని తాను ప్రార్థన చేస్తున్నానని దీదీ చెప్పారు. కాగా ఆయన వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది.
యోగేశ్ వర్షనీ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మమతా దీటుగా స్పందించారు. తాను దుర్గ పూజలు పాల్గొంటానని, మసీదుకు కూడా వెళ్తానని, చర్చిలో ప్రార్థనలు చేస్తానని, ఆపడానికి మీరెవరని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
ఇష్టం వచ్చినట్టు ఎవరు తనను తిట్టినా బాధపడనని, తెలియక అలా అన్నారని, వారిని క్షమించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తానన్నారు. ముర్షిదాబాద్ జిల్లా డోమ్‌కల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మమత మాట్లాడుతూ.. తనపై ఇలాంటి అభ్యంతరకరమైన పదాల్ని నిత్యం ఎవరో ఒకరు సంధిస్తుంటారనీ, అలాంటి వాటితో తాము మరింత అభివృద్ధి చెందుతున్నామన్నారు.

యోగేశ్ వ్యాఖ్యలపై కోల్‌కతా టిప్పు సుల్తాన్ షాహీ మసీద్ ఇమామ్ రెహ్మాన్ బర్కతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతాపై మాకెంతో గౌరవం ఉందని, ఆమెను నేను సోదరిగా భావిస్తానని, అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసిన ఆ నేత తల నరికి తెచ్చిన వారికి రూ. 22లక్షల రివార్డు ఇస్తానని ప్రకటన చేశారు.
రెహ్మాన్ బర్కతీ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ రచయిత సల్మాన్ రషీదీపై ఆయన రివార్డులు ప్రకటించిన సందర్భాలున్నాయి.
బీర్భమ్ జిల్లాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలో పోలీసులు, ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై స్పందించిన యోగేశ్.. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ. 11లక్షల బహుమతి ఇస్తానని, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు ఆమె అనుమతించట్లేదని, ఎదిరించి చేసుకుంటే వారిని తీవ్రంగా కొడుతున్నారని, ఆమె ముస్లింలకు మద్దతిస్తారని, ఇఫ్తార్ విందులు చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications