వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు: దేవాలయంలో సతీమణితో కలిసి పూజలు చేసిన సీజేఐ, వీడియో వైరల్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు తీర్పు అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ మొదటి సారి దేవాలయంలో పూజలు చేశారు. అసోంలోని గుహవాటిలోని కామాక్య దేవాలయంలో జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి కామాక్య ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయోధ్య కేసు తీర్పు అనంతరం జస్టిస్ రంజన్ గొగోయ్ శ్రీరాముడి దర్శనం చేసుకోవడానికి దేవాలయానికి వెళ్లారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

 After Land mark Judgement on Ayodhya Case, CJI Ranjan Gogoi with his Wife Visits Kamakhya Temple in Guwahati.

అయితే అయోధ్య కేసు తీర్పు తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ శ్రీరాముడిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్లలేదని, గుహవాటిలో కామాక్య దేవాలయంలో పూజలు చెయ్యడానికి వెళ్లారని వీడియోలో స్పష్టంగా వెలుగు చూసింది.

అసోంలోని మచ్చౌడ్ లో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి అక్కడి నుంచి 51 శక్తి పీఠాల్లో ఒక్కటైన కామాక్య ఆలయంలో పూజలు చెయ్యడానికి ఆయన సతీమణితో కలిసి వెళ్లారు.

ఇదే నెల నవంబర్ 17వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చెయ్యనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చెయ్యడానికి ముందే జస్టిస్ రంజన్ గొగోయ్ అనేక సంచలన కేసుల తీర్పులు ఇవ్వనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇవ్వనున్న సంచలన తీర్పుల్లో శబరిమల, రఫెల్ డీల్ కేసులు ఉన్నాయి.

English summary
New Delhi: A
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X