ఇండియాలో ఏజెంట్ స్మిత్.. సార్ట్‌ఫోన్ యూజర్లు జర భద్రం..
డిజిటల్ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ పెను సవాల్‌గా మారింది. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి టెక్నాలజీని ఉపయోగించి ఎవరు, ఎప్పుడు, ఎలా దాడి చేస్తారన్నది ఊహించలేని పరిస్థితి. ముఖ్యంగా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలలోకి మాల్‌వేర్‌లు జొప్పించి సమాచారాన్ని దోచుకున్న ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాను సైతం హ్యాకింగ్ భూతం వదలిపెట్టలేదు. ఇప్పుడు అలాంటి వైరస్ భారత్‌లో ఎంటరైంది.

ఇండియాలో ఏజెంట్ స్మిత్
వాట్సప్ ఓపెన్ చేయగానే యాడ్ కనిపిస్తోందా? అయితే ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. మీ ఫోన్‌లోకి ఏజెంట్ స్మిత్ ఎంటరయిందని అనుమానించాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లను ఏజెంట్ స్మిత్ వైరస్ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ మాల్ వేర్ దాడి చేసిందని చెక్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్‌లో చొరబడి
ఏజెంట్ స్మిత్ మాల్‌వేర్ భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ప్రవేశించినట్లు సైబర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గూగుల్‌కు సంబంధించిన అప్లికేషన్ రూపంలో ఈ వైరస్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. యూజర్లకు తెలియకుండానే ఫోన్‌లో యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేసి వాటి స్థానంలో ఫోన్‌కు హాని కలిగించే ఇతర వెర్షన్స్‌ను రీప్లేస్ చేస్తుంది. గూలిగన్, హమ్మింగ్ బడ్, కాపీ క్యాట్ తదితర వైరస్‌లను పోలి ఉండే ఏజెంట్ స్మిత్ మనకు తెలియకుండానే ఫోన్‌లో చొరబడి దాడి చేస్తున్నట్లు సైబర్ ఎక్స్‌పర్ట్స్ తేల్చారు.

థర్డ్ పార్టీ యాప్ నుంచి
యాప్స్ 9 అనే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి ఏజెంట్ స్మిత్ డౌన్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. థర్డ్ పార్టీ యాప్ స్టోర్లలో భద్రత లేనందునే ఏజెంట్ స్మిత్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ వైరస్ ప్రస్తుతానికి ఫోన్లలోని ఎలాంటి డేటా తస్కరించడంలేదని, కేవలం యాడ్స్ డిస్ ప్లే చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తేలింది. అయితే భవిష్యత్తులో దీన్ని ఫోన్లలోని బ్యాంక్ వివరాలతో పాటు ఇతర డేటాను దొంగలించేందుకు ఉపయోగించే అవకాశం లేకపోలేదు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications