అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలి: పన్నీరు వద్దని శశికళ
‘తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలి. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వరాదు. తదుపరి శాసనసభాపక్ష నేతగా అందరికీ ఆమోదయోగ్యమైన వారినే ఎన్నుకుందాం’ అని ఎమ్మెల్యేలతో శశికళ చెప్పినట్లు తెలిసింది.
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత శశికళ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. సోమవారం మధ్యాహ్న గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లిన శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశమై రాత్రి అక్కడే బస చేశారు. సుప్రీం కోర్టు శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించడంతో అనంతర పరిణామాలపై అంతరంగీకులతో చర్చలు జరుపుతున్నారు.
'తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలి. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వరాదు. తదుపరి శాసనసభాపక్ష నేతగా అందరికీ ఆమోదయోగ్యమైన వారినే ఎన్నుకుందాం' అని ఎమ్మెల్యేలతో శశికళ చెప్పినట్లు తెలిసింది. పార్టీకి ద్రోహం చేసిన పన్నీరు సెల్వం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాకూడాదని శశికళ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు శశికళ శిబిరం సెంగొట్టయ్యన్, పళనిస్వామి పేర్లను తెరపైకి తెచ్చింది. శశికళ ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్‌లోని ఎమ్మెల్యేల శిబిరంలోనే ఉన్నారు. శశికళ మేనల్లుడు దీపక్‌ను మేనల్లుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే చివరకు పళనిస్వామినే అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది.
మరో వైపు పన్నీర్ సెల్వం.. కోర్టు తీర్పు అనంతరం నెలకొన్న పరిణామాలపై అంతరంగికులతో మంతనాలు జరుపుతున్నారు. బలం కూడగట్టుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. పన్నీర్‌సెల్వం నివాసం వద్దకు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications