వామ్మో ఏంటీ ఘోరం.. ఎయిర్ ఇండియా విమానంలోనే కుప్పకూలిన పైలట్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించిన ఘటనను మరువక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. మరికొద్ది సేపట్లో విమానం బయల్దేరుతుందనగా పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని హుటాహుటిన విమాన సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. వెంటనే విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు.

బెంగళూరు నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ2414 విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. మరికొద్ది సేపట్లో విమానం టేకాఫ్ అవుతుంది అనగా అందులోని పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.వెంటనే విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు.. పైలట్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎయిర్ ఇండియా విమానం కొంత సమయం పాటు నిలిపివేశారు. ఆ తర్వాత మరొక పైలట్ రాకతో విమానం టేకాఫ్ అయింది. ప్రస్తుతం పైలట్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

Air India Flight AI2414 Delayed as Pilot Collapses Moments Before Bengaluru-Delhi Takeoff

ఇక ఇటీవల దేశంలో అనేక విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్నింటిలో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో విమాన ప్రయాణం అంటేనే ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది మరణించారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు.. 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరి కొంతమంది వైద్య విద్యార్థులు కూడా మృతి చెందారు.

ఈ ప్రమాదంలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోవడంతో 265 మంది మృతి చెందారు. అయితే ఇంతటి ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్ ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+