తల్లి చెల్లి తేడా లేదు..వదినపై కూడా: మృగాడికి శిక్షవేసిన కుటుంబ సభ్యులు

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఓ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులే హతమార్చారు. ఆ వ్యక్తి వ్యవహార శైలితో విసిగి వేశారిపోయి గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు ఫినిష్ చేసేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

 వ్యక్తిని హత్యచేసిన కుటుంబ సభ్యులు

వ్యక్తిని హత్యచేసిన కుటుంబ సభ్యులు

మధ్యప్రదేశ్‌లోని దతియా ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సొంత కుటుంబ సభ్యులే అతన్ని హతమార్చారు. హతమార్చాకా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గోపాల్‌దాస్‌లోని కొండప్రాంతంలో పడేశారు. అయితే ఆ కుటుంబ సభ్యులు అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలిస్తే ఈ శిక్ష సరైనదే అనే కంక్లూజన్‌కు రాక మానరు. వారు ఇచ్చిన వివరణతో పోలీసులే షాక్ అయ్యారు.

 మద్యం మత్తులో తల్లి చెల్లి వదినలపై...

మద్యం మత్తులో తల్లి చెల్లి వదినలపై...

మధ్యప్రదేశ్‌లోని దతియా ప్రాంతంలో ఓ కుటుంబం నివాసముంది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె, ఇంటి పెద్ద కోడలు ఉంటారు. ఇందులో చిన్న కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. ఇంతవరకు ఓకే. కానీ తాగిన మత్తులో తల్లి ఎవరో చెల్లి ఎవరో అనేది మరిచి ప్రవర్తించాడు. కన్న తల్లిపైనే అత్యాచారంకు దిగాడు ఈ 24 ఏళ్ల దుర్మార్గుడు. అంతేకాదు కామంతో కటకటలాడి పోయిన ఈ మృగాడు చెల్లిపై కూడా అత్యాచారంకు పాల్పడ్డాడు. ఇక ఇంకాస్త ముందుకు వెళ్లి అన్న భార్య తల్లి సమానురాలైన వదినపై కూడా తన కామాన్ని ప్రదర్శించి ఆమెపై కూడా లైంగిక దాడి చేశాడు.

మరోసారి వదినపై చేయివేయగా...

మరోసారి వదినపై చేయివేయగా...

బయట చెప్పుకుంటే పరువుపోతుందని భావించిన కుటుంబ సభ్యులు పలుమార్లు ఆ వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇలాంటి వ్యక్తి భూమికి భారం అని భావించారు. అందరూ కూడగట్టుకుని వాడిని చంపేందుకు స్కెచ్ వేశారు. వాడిని చంపాలని మొట్ట మొదటగా భావించిందే ఆ తల్లి. ఇక ప్లాన్ అమలు చేశారు. అయితే నవంబర్ 11వ తేదీన మద్యం మత్తులో ఇంటికి చేరుకుని మళ్లీ అతని వదినపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సారి వెనక్కు నుంచి బలంగా కొట్టిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత గొంతును నులిమి హత్యచేశారు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి తండ్రి పోలీసులకు చెప్పాడు.

 కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న తండ్రి

కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న తండ్రి

నవంబర్ 12వ తేదీన గోపాల్ దాస్‌ ఏరియాలోని కొండప్రాంతంలో మృతదేహం కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోస్టుమార్టంకు పంపించగా వ్యక్తి హత్యకు గురయ్యాడని వైద్యులు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులను విచారణ చేయగా వారు పోలీసులకే దిమ్మతిరిగే నిజాలు చెప్పారు. పలుమార్లు ఇంట్లోని ఆడవారిపై వావివరసలు మరిచి పశువులా ప్రవర్తించడంతోనే అంతా కలిసి వాడిన హత్యచేసినట్లు తండ్రి చెప్పాడు. కొడుకు వ్యవహారంతో విసిగి వేశారి హత్య చేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లే అని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తానే తన కొడుకు గొంతు నులిమి చంపినట్లు తండ్రి కోర్టులో అంగీకరించాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+