నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం : విదేశాంగ శాఖ
Recommended Video

న్యూఢిల్లీ : లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీ ఫోటోలు వైరలవడంతో విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ సహా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడంతో .. రియాక్టైంది. లండన్ లో ఉన్న నీరవ్ మోదీని భారత్ రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. నీరవ్ అప్పగింతకు సంబంధించిన అంశాలు లండన్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నది.

అన్ని చర్యలు తీసుకున్నాం ...
బ్యాంకుల నుంచి రుణం తీసుకొని .. చెల్లించక విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీని భారత్ తిరిగి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్. భారత ప్రభుత్వ వినతి లండన్ ప్రభుత్వం పరిశీలిస్తోందని మీడియాకు వెల్లడించారు. లండన్ లో ఖరీదైన భవంతిలో ఉంటూ .. కొత్తగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారని టెలీగ్రాఫ్ పత్రిక ఫోటో, వీడియోలు ప్రచురించింది. దీంతో విపక్షాలు దాడి చేయడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
#WATCH Ministry of External Affairs (MEA) Spokesperson, Raveesh Kumar responds to ANI's questions on Pakistan PM Imran Khan's latest statement and on Nirav Modi's extradition. pic.twitter.com/Omao4MIXDt
— ANI (@ANI) March 9, 2019
విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నుంచి కోరుతోంది. అయినా ఇప్పటికీ చర్యలు ప్రారంభం కాలేదు. కానీ నీరవ్ మోదీ మాత్రం ఏంచక్కా వేషం మార్చి .. విలాసవంతమైన భవనంలో .. ఖరీదైన జీవితం గడుపుతున్నాడు.












Click it and Unblock the Notifications