నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ : పంజాబ్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో గెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలను టెలీగ్రాప్ పత్రిక ప్రచురించింది. దీంతో అధికార ఎన్డీఏపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీని దేశానికి తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది.
జర్నలిస్టుకు దొరికాడు .. మరి మోదీకి ?
లండన్ వీధుల్లో వేషం మార్చి తిరుగుతున్న నీరవ్ మోదీని ఓ రిపోర్టర్ కనిపెట్టాడు. భారత్ లో వేల కొట్టు ఎగనామం పెట్టి ఇక్కడ తిరుగుతున్నాడని వార్త కథనం .. ఫోటో, వీడియాలతో ప్రచారం చేశారు. మరి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దేశంలో ఉన్న వ్యవస్థలను వాడుకోవడంతో ప్రధాని మోదీ ఎందుకు విపలమయ్యారని నిలదీసింది. లండన్ లో ఉన్న నీరవ్ ను ఎవరు కాపాడుతున్నట్టు ? అతనేనా లేదా ఆయన వెనక ఎవరు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
విదేశాల్లో విలాస జీవితం
నీరవ్ ఇష్యూకి సంబంధించి ఒక అడుగు ముందుకేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. 'దేశం నుంచి వేల కోట్లు తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు .. తర్వాత ప్రధానమంత్రితో ఫోటోలు దిగొచ్చు .. అయినా సమస్యలేమి ఉత్పన్నం కావు. అక్కడినుంచి లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపొచ్చు .. అడిగే నాథుడే .. పట్టుకొనే వారు ఎవరు ఉండు‘ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ట్రైలర్ చూడండి
ఓ సాధారణ వ్యక్తి వ్యాపార వేత్తగా ఎలా ఎదగొచ్చో .. బ్యాంకులను ఎలా మోసం చేసి .. విదేశాల్లో విలాసవంత జీవితం ఎలా గడుపొచ్చే టెలీగ్రాఫ్ విడుదల చేసిన వీడియా చూడాలని సుర్జేవాలా కోరారు. ఇది నీరవ్ ట్రైలర్ అని ట్వీట్ చేశారు. దీనిని నిర్మించి, దర్శకత్వం వహించింది ప్రధాని నరేంద్రమోదీ అయితే .. ఎడిట్ చేసింది అరుణ్ జైట్లీ అని .. కథ, కథనం, ఈడీ, సీబీఐ ... ఈ ట్రైలర్ విలువ రూ.23 వేల కోట్లు అని ... పెట్టుబడి పెట్టింది భారతీయ బ్యాంకులు అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications